https://oktelugu.com/

శంకర్ -రాంచరణ్ సినిమాలో పవన్ ప్లేసులో కోలివుడ్ స్టార్

తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తెలుగులో తీస్తున్న తొలిసినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తోనే కావడం గమనార్హం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. Also Read: తేజ మరో సంచలనం.. ఏకంగా 45 మంది కొత్తవారితో చిత్రం అయితే తొలుత ఈ కథలో హీరోతో సమానమైన ఓ కీలకపాత్రలో పవన్ కళ్యాణ్ ను నటింపచేయాలని దిల్ రాజు ఫిక్సయ్యాడట.. ఈ మేరకు పవన్ తో సాన్నిహిత్యం.. చరణ్ తో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2021 / 06:10 PM IST
    Follow us on

    తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తెలుగులో తీస్తున్న తొలిసినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తోనే కావడం గమనార్హం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

    Also Read: తేజ మరో సంచలనం.. ఏకంగా 45 మంది కొత్తవారితో చిత్రం

    అయితే తొలుత ఈ కథలో హీరోతో సమానమైన ఓ కీలకపాత్రలో పవన్ కళ్యాణ్ ను నటింపచేయాలని దిల్ రాజు ఫిక్సయ్యాడట.. ఈ మేరకు పవన్ తో సాన్నిహిత్యం.. చరణ్ తో సినిమా కావడంతో ఒప్పుకుంటాడని భావించారు.

    కానీ వరుసగా నాలుగు సినిమాలను పవన్ లైన్లో పెట్టడం.. మధ్యలో రాజకీయాలు చేస్తున్న పవన్ కు ఖాళీ టైం లేదు. పైగా ఈ మూవీని తమిళనాడులోని చెన్నైలోనే చాలా వరకు షూటింగ్ చేయనున్నారు.

    Also Read: అదే నా కల అని చెబుతున్న అనసూయ..: అదేంటో తెలుసుకుందాం

    దీంతో పవన్ తో పెట్టుకుంటే సినిమా ముందుకెళ్లదని శంకర్ భావించారు. అదేకాకుండా శంకర్ కు తమిళంలో ఉన్న మార్కెట్ దృష్ట్యా ఓ తమిళ స్టార్ హీరోను తీసుకుంటే అక్కడా మార్కెట్ ఉంటుందని శంకర్ ప్రతిపాదించినట్టు సమాచారం. దీంతో రాంచరణ్ మూవీలో తళక్కున మెరవాల్సిన పవన్ కు ఆ ఛాన్స్ తృటిలో చేజారిపోయిందని.. అబ్బాయి-బాబాయ్ కలిస్తే బాక్సాఫీసు బద్దలయ్యేదని మెగా ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్