ఆ టాప్ మూడు చానెళ్లను బహిష్కరించిన టీడీపీ.. కారణమిదే?

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంతపాడడం మీడియా చేసే పని. తెలుగు రాష్ట్రాల్లో అయితే పార్టీలే బలమైన మీడియాలను స్థాపించి.. లేదంటే కొనుగోలు చేసి మరీ తమకు భజన చేయించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు , వైసీపీకి కూడా బలమైన మీడియా సంస్థలున్నాయి. Also Read: ప్రతీకారం బిట్టు శ్రీనుదా..? కుంట శ్రీనుదా..? : పాలుపంచుకున్నదెవరు..? వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా బలమైన టీడీపీ అనుకూల మీడియాను తట్టుకోలేక ఆపసోపాలు పడింది. […]

Written By: NARESH, Updated On : February 20, 2021 2:00 pm
Follow us on

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంతపాడడం మీడియా చేసే పని. తెలుగు రాష్ట్రాల్లో అయితే పార్టీలే బలమైన మీడియాలను స్థాపించి.. లేదంటే కొనుగోలు చేసి మరీ తమకు భజన చేయించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు , వైసీపీకి కూడా బలమైన మీడియా సంస్థలున్నాయి.

Also Read: ప్రతీకారం బిట్టు శ్రీనుదా..? కుంట శ్రీనుదా..? : పాలుపంచుకున్నదెవరు..?

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా బలమైన టీడీపీ అనుకూల మీడియాను తట్టుకోలేక ఆపసోపాలు పడింది. ఏకంగా నాడు ఏబీఎన్, టీవీ5 చానళ్లను వైసీపీ బహిష్కరించింది. ఆ చానళ్లను అనుమతించలేదు. వైసీపీ నేతలు చర్చల్లో పాల్గొనలేదు. నాడు దీన్ని తీవ్రంగా ఖండించిన తెలుగు దేశం పార్టీ నేడు తమదాకా వచ్చేసరికి అలానే ప్రవర్తించడం విశేషం.

తాజాగా టీడీపీ కూడా మీడియాను బహిష్కరించింది. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోని టాప్ 3 చానెళ్లను బాయ్ కాట్ చేయడం మీడియా సర్కిల్స్ లో సంచలనమైంది.

తెలుగులో నంబర్ 1 న్యూస్ చానెల్ అయిన టీవీ9తోపాటు ఎన్టీవీ, ప్రైమ్ 9 న్యూస్ లను టీడీపీ బహిష్కరించింది. ఆ చానెళ్లకు ఏ టీడీపీ నేత వెళ్లి చర్చల్లో పాల్గొనవద్దని.. నేతలు ఆ చానెళ్లను మీడియా సమావేశాలకు పిలువవద్దని స్పష్టం చేసింది.

Also Read: మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి

నిజానికి ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని, జగన్ ను బలమైన టీడీపీ మీడియా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. టీడీపీపై కేవలం సాక్షి సహా కొన్ని చానెళ్లు మాత్రమే రాసుకొస్తున్నాయి. టీడీపీ మీడియా పోలిస్తే ఇది స్వల్పమే. అయినా కూడా టీడీపీ బట్టలు చింపుకొని మూడు చానెళ్లను నిషేధించడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్