https://oktelugu.com/

పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎక్కువగా వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

మనలో చాలామంది ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఎక్కువగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. వైద్యులు కూడా రోగులకు ఈ ట్యాబ్లెట్ నే ఎక్కువగా వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను తరచూ వాడకూడదని సూచిస్తున్నారు. Also Read: సపోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? తరచూ పారాసిటమాల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 19, 2021 / 06:31 PM IST
    Follow us on

    మనలో చాలామంది ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఎక్కువగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. వైద్యులు కూడా రోగులకు ఈ ట్యాబ్లెట్ నే ఎక్కువగా వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను తరచూ వాడకూడదని సూచిస్తున్నారు.

    Also Read: సపోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

    తరచూ పారాసిటమాల్ వాడటం మంచిది కాదని..1500 మంది వ్యక్తులపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నడుము, వెన్నునొప్పితో బాధ పడుతున్న కొంతమందికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చారు. మరి కొంతమందికి మాత్రం పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను ఇవ్వలేదు. శాస్త్రవేత్తలు ట్యాబ్లెట్ తీసుకున్న వారిని, తీసుకోని వారిని కొన్ని రోజుల పాటు పరిశీలించారు.

    Also Read: తక్కువ బరువు ఉన్నవారికి షుగర్ వస్తుందా.. నిపుణులు ఏం చెప్పారంటే..?

    15 రోజుల తరువాత పారాసిటమాల్ తీసుకున్న వారిని, తీసుకోని వారిని పరిశీలించగా ట్యాబ్లెట్ తీసుకున్న వారిలో, ట్యాబ్లెట్ తీసుకోని వారిలో పెద్దగా తేడా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైద్య నిపుణులలో కొందరు సైతం నడుము, వెన్నునొప్పి లాంటి సమస్యలకు ఫిజియో వ్యాయామాలే చేయడం మంచిదని సూచనలు చేస్తున్నారు. ల్యాన్సెట్ అనే జర్నల్ లో పారాసిటమాల్ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురింపబడ్డాయి.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    చాలామంది వైద్యులు ఎక్కువగా సూచించే పారాసిటమాల్ ఎక్కువగా వాడితే ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. హానిలేని మందుగా వైద్యులు భావించే పారాసిటమాల్ ఫలితాలు వైద్యులకే షాక్ ఇచ్చేలా ఉండటం గమనార్హం.