సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ లోని పోలీస్ స్టేషన్లో ఉన్నారు. తన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కోసం ఆ మధ్య దుబాయ్ వెళ్లిన ప్రిన్స్.. అక్కడే ఉన్నాడు. తాజాగా మహేష్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో కనిపించే సరికి ఏం జరిగి ఉంటుందా అని ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
గల్ఫ్ మీడియా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మహేష్ బాబు మెడపై రూపాయి కాయిన్ టాటూ ఉంది. ఇదంతా చూస్తుంటే.. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీన్ ఏదైనా షూట్ చేస్తున్నారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ‘ఇలాంటి పోలీస్ స్టేషన్ ను ఇంతకముందు ఎప్పుడూ చూడలేదు. ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’ అని మహేష్ పేర్కొనడంతో అది షూట్ లో భాగమేనని కన్ఫామ్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం.. దుబాయ్ లో ‘సర్కారు వారి పాట’ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో మహేష్ – కీర్తి సురేష్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఫిబ్రవరి 21నాటికి ఈ షెడ్యూల్ పూర్తిచేసుకొని ఇండియాకి తిరిగి రావాలన్నది యూనిట్ ప్లాన్. అంతేకాదు.. మరో ప్లాన్ కూడా చేస్తోందట చిత్ర బృందం.
ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత.. ‘దుబాయ్ డైరీస్’ పేరుతో ఇక్కడి షూటింగ్ విశేషాలతో కూడిన ఓ వీడియోను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. దీనివల్ల సినిమాకు మరింత ప్రమోషన్ రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు మేకర్స్.