https://oktelugu.com/

కంగనా vs తాప్సీ… ‘బీ గ్రేడ్‌’ ఫైట్

కరోనా టైమ్‌లో బాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్‌ ఆగిపోయినా.. వివాదాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతి, మూవీ మాఫియాపై రోజూ చర్చ జరుగుతూనే ఉంది. పలువురు బడా హీరోలు, దర్శక, నిర్మాతలు వారి వారసులపై ఏదో రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కరణ్‌ జోహార్, సల్మాన్‌ ఖాన్‌, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ఈ దాడిలో బాలీవుడ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 9:49 am
    Follow us on


    కరోనా టైమ్‌లో బాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్‌ ఆగిపోయినా.. వివాదాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతి, మూవీ మాఫియాపై రోజూ చర్చ జరుగుతూనే ఉంది. పలువురు బడా హీరోలు, దర్శక, నిర్మాతలు వారి వారసులపై ఏదో రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కరణ్‌ జోహార్, సల్మాన్‌ ఖాన్‌, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ఈ దాడిలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ముందుంది. బంధుప్రీతి కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కంగనా ఆరోపించింది. వాటిని రుజువు చేయకపోతే తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా అని సవాల్‌ విసిరింది. అంత వరకు బాగానే తనలాగే ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తాప్సీ పన్నును ఈ వివాదంలోని లాగింది కంగనా. నెపోటిజమ్‌ డిస్కషన్స్‌లో భాగంగా తాప్సీతో పాటు స్వరా భాస్కర్‌లను ‘బీ గ్రేడ్‌ యాక్టర్స్‌’ అని కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

    వయసు అయిపోయాక స్పీడ్ అందుకుంది !

    బాలీవుడ్‌లో బ్యాగ్రౌండ్‌ లేని వాళ్లు చాలా ఇబ్బందులుపడుతున్నారని చిత్రీకరించేలా కొందరు ప్రవర్తిస్తున్నారని, దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవారు చాలా భయపడతారని ఓ ఇంటర్వ్యూ తాప్సీ అభిప్రాయపడింది. అలాగే, కరణ్‌ జోహార్ మంచివాడని, ఏ బ్యాక్‌గ్రౌండ్‌లేని తాను బాలీవుడ్‌లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నానని తాప్సీ చెప్పడం మింగుడు పడని కంగనా ఆమెను బీ గ్రేడ్‌ నటి అని అవహేళన చేసింది. తాప్సి, స్వరను అత్యాశతో ఉన్న ఔట్‌సైడర్స్‌ అని, అయితే ఆలియా భట్‌, అనన్యా పాండే కంటే మంచి యాక్టర్లే అని అభిప్రాయపడింది. అయితే, దీనిపై తాప్సీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ‘పది, పన్నెండు తరగతుల స్టూడెంట్స్‌ ఫలితాల తర్వాత మా రిజల్ట్స్‌ కూడా వచ్చాయని విన్నాను. మా గ్రేడ్‌ సిస్టమ్‌ ఇప్పుడు అధికారికమేనా? ఇప్పటివరకు నెంబర్‌ సిస్టమ్‌ అనుకున్నానే. దాని ద్వారానే మా వ్యాల్యూ డిసైడ్‌ చేస్తారని అనుకున్నా’ అంటూ కంగనాను ఉద్దేశిస్తూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరింది తాప్సీ. మరోవైపు కంగనా కామెంట్‌ను కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని స్వరా భాస్కర్ ట్వీట్ చేసింది. ఇంకోవైపు తాప్సీకి పలువురు స్టార్ హీరోయిన్లు మద్దతు ఇస్తున్నారు. దాంతో, ఈ వివాదం మరింత పెద్దదయ్యేలా ఉంది.