మణిరత్నం ‘నవరస’ సిరీస్‌లో తెలుగు స్టార్లు!

కరోనా కష్టకాలంలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కనిపిస్తున్న ఏకైక మార్గం డిజిటల్‌ మీడియా. ఓటీటీ, ఏటీటీ.. పేరేదైనా గానీ ఫ్యూచర్ డిజిటల్‌ మీడియాదే. ఈ వాస్తవాన్ని గ్రహిస్తూ.. సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే ఓటీటీల బాట పడుతున్నారు. వాళ్లే కాదు స్టార్లు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికే సమంత, నిత్యా మీనన్, ప్రియమణి తదితరులు హిందీ వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. దర్శకుడు క్రిష్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ కోసం పని చేస్తున్నారు. నవదీప్‌, ప్రియదర్శి, […]

Written By: Neelambaram, Updated On : July 21, 2020 9:42 am
Follow us on


కరోనా కష్టకాలంలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కనిపిస్తున్న ఏకైక మార్గం డిజిటల్‌ మీడియా. ఓటీటీ, ఏటీటీ.. పేరేదైనా గానీ ఫ్యూచర్ డిజిటల్‌ మీడియాదే. ఈ వాస్తవాన్ని గ్రహిస్తూ.. సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే ఓటీటీల బాట పడుతున్నారు. వాళ్లే కాదు స్టార్లు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికే సమంత, నిత్యా మీనన్, ప్రియమణి తదితరులు హిందీ వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. దర్శకుడు క్రిష్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ కోసం పని చేస్తున్నారు. నవదీప్‌, ప్రియదర్శి, సందీప్‌ కిషన్‌, సత్యదేవ్‌, బిందు మాధవి, హెబ్బా పటేల్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో నటించాడు.ఇప్పుడు పలువురు తెలుగు స్టార్ హీరోలు కూడా వెబ్‌ సిరీస్‌కు జై కొట్టబోతున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది ఎపిసోడ్స్‌ తీసేలా మణిరత్నం వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్‌ చేశాడు. ఆయనతో పాటు గౌతమ్‌ మీనన్, కార్తీక్‌ నరేన్‌, నంబియార్, హీరోలు సిద్ధార్థ్‌, అరవింద్‌ స్వామి మరో ముగ్గురు దర్శకులు ఒక్కో ఎడిసోడ్‌కు డైరెక్షన్‌ వహిస్తారు. నవరసాల్లోని ఒక్కో ఎమోషన్‌ను ఒక్కో ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు. ఎపిసోడ్‌కు ఒకరు చొప్పున తొమ్మిది మంది హీరోలు నటిస్తారని సమాచారం.

చిన్న సినిమాలకు ఇది బంపర్ ఆఫరే !

ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోలు సిద్ధార్థ్‌, అరవింద్‌ స్వామి, మాధవన్‌ నటిస్తారని, సూర్య విలన్‌గా క్యారెక్టర్ కు ఒప్పుకున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి . తాజా సమాచారం మేరకు పలువురు తెలుగు స్టార్ హీరోలను సైతం ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నాడట. అలా చేస్తే హిందీతో పాటు దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్‌కు ఉపయోగ పడుతుందని అనుకుంటున్నారట. అందుకోసం సీనియర్ హీరో అక్కినేని నాగార్జున్‌తో పాటు ఆయన కొడుకు నాగ చైతన్య, నాని, కార్తికేయ వంటి యంగ్‌స్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే, తెలుగు నుంచి ఒక్కరే కావాలా? ఎక్కువ మందిని తీసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే, టాలీవుడ్లో ఎవరు ఒప్పుకున్నా ఈ వెబ్‌ సిరీస్‌కు మరింత క్రేజ్ రావడం ఖాయమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.