టీడీపీ స్థాపించినప్పటి నుండీ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులలో ఎమ్మెల్యే కరణం బలరాం ఒకరు. కెరీర్ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం ఒకసారి ఎంపీగా కూడా చేశారు. టీడీపీ పార్టీ నాయకుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన, కారణం ఏమిటో కానీ చంద్రబాబుపై తిరుగుబాటు మొదలుపెట్టాడు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కరణం బలరాం టీడీపీలో రెబెల్ ఎమ్మెల్యే గా మారడం చాల మందిని షాక్ కి గురిచేసింది. ఐతే కరణం బలరాంలో అసహనం పురుడు పోసుకోవడానికి కారణం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని పార్టీలోకి తీసుకోవడమే.
2014 ఎన్నికలలో గొట్టిపాటి రవికుమార్ పై ఓడిపోయిన బలరాం, అధికారం టీడీపీకి దక్కడంతో ఓడినా నియోజకవర్గంలో చక్రం తిప్పవచ్చు అనుకున్నారు. ఐతే వైసీపీ తరపున ఎమ్మెల్యే గా గెలిచిన గొట్టిపాటిని బాబు పార్టీలోకి బలవంతగా లాక్కొని, అధికార పార్టీ ఎమ్మెల్యేని చేశాడు. దీనిటో బలరాం హవా అక్కడ తగ్గింది. ఇక గత ఎన్నికల్లో కూడా బాబు బలమైన అభ్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఎదుర్కోవడానికి, కోరిన నియోజక వర్గం కాకుండా, చీరాల నియోజక వర్గం సీటు ఇవ్వడం జరిగింది. ఆమంచి కృష్ణ మోహన్ పై ఉన్న వ్యతిరేకత ఆయనకు విజయాన్ని కట్టబెట్టింది.
జగన్ ఎస్ అంటే వైసీపీలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్న బలరాం, ముందుగా తన కుమారుడిని వైసీపీలో చేర్చారు. టీడీపీలో రెబెల్ ఎమ్మెల్యే గా ఉంటూ, వైసీపీకి అనుకూలుడుగా ఉంటున్నారు. బలరాం వైసీపీకి దగ్గర కావడం చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచికి చిక్కులు తెచ్చిపెట్టింది.ఓడినా, మొన్నటి వరకు చీరాల నియోజక వర్గంలో హవా మొత్తం ఆమంచిదే. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంజీవని కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని కరణం బలరాం ప్రారంభించారు. ఇక సీఎం జగన్ ఆమంచికి పక్కనే ఉన్న పర్చూరు నియోజక వర్గ ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించనున్నాడట. స్థానికంగా పాతుకుపోయిన ఆమంచికి పర్చూరు వెళ్లడం ఇష్టం లేదు. కానీ మరోదారి లేని ఆమంచి జగన్ సూచనలు పాటించక తప్పని పరిస్థితి. పదేళ్లుగా చీరాల నియోజకవర్గంలో ఏక ఛత్రాధిపత్యం చేస్తున్న ఆమంచికి కరణం చెక్ పెట్టారనేది లోకల్ టాక్.