https://oktelugu.com/

రేప్ కేసు పై సురేఖావాణి కూతురు స్పందన

డిజిటల్ విప్లవం వచ్చాక ప్రతి ఒక్కడు ఫేమస్ అయిపోతున్నాడు. టిక్‌ టాక్‌ ద్వారా స్టార్‌ అయిపోయాడు భార్గవ్‌ అనే కుర్రాడు. ఇప్పుడు ఇతగాడి కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. అవకాశాలిప్పిస్తానంటూ ఓ మైనర్‌ బాలిక పై భార్గవ్ అత్యాచారం చేయడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఫన్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన భార్గవ్‌, ఇలాంటి వ్యక్తా అంటూ అతనితో సన్నిహితంగా మెలిగిన వారంతా ఇప్పుడు ఇబ్బందుల పాలు అవుతున్నారు. మొత్తానికి ఈ కేసు […]

Written By:
  • admin
  • , Updated On : April 22, 2021 / 05:29 PM IST
    Follow us on

    డిజిటల్ విప్లవం వచ్చాక ప్రతి ఒక్కడు ఫేమస్ అయిపోతున్నాడు. టిక్‌ టాక్‌ ద్వారా స్టార్‌ అయిపోయాడు భార్గవ్‌ అనే కుర్రాడు. ఇప్పుడు ఇతగాడి కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. అవకాశాలిప్పిస్తానంటూ ఓ మైనర్‌ బాలిక పై భార్గవ్ అత్యాచారం చేయడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఫన్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన భార్గవ్‌, ఇలాంటి వ్యక్తా అంటూ అతనితో సన్నిహితంగా మెలిగిన వారంతా ఇప్పుడు ఇబ్బందుల పాలు అవుతున్నారు. మొత్తానికి ఈ కేసు అతన్ని కటకటాల్లోకి నెట్టేలా చేసింది.

    అయితే తాజాగా ఈ ఘటన పై ప్రముఖ నటి సురేఖావాణి గారాల పట్టి ‘సుప్రిత’ స్పందిస్తూ భార్గవ్ కి సంబంధించిన ఓ వార్తను కూడా పోస్ట్ చేసింది. “భార్గవ్‌.. టిక్‌టాక్‌ వీడియోలో చూసిన 14 ఏళ్ల బాలికను ఇతర చానళ్లలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడని, అలాగే ప్రేమిస్తున్నానంటూ అతను ఆ బాలికకు ప్రపోజ్‌ చేశాడని.. కానీ అమ్మాయి నో చెప్పినా కూడా వీడియోల పేరుతో దగ్గరయ్యాడని.. డ్రెస్‌ చేంజ్‌ చేసుకున్న వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ ఆమెను లోబర్చుకున్నాడని” అతని గురించి పోలీస్‌ అధికారి చెప్పిన మాటలు విని సుప్రీత షాకైంది. ఇలాంటి సంఘటనల గురించి స్పందించాలంటేనే తనకు చాల ఇబ్బందిగా ఉందని సుప్రిత చెప్పుకొచ్చింది.

    ఇలాంటి నీచమైన విషయాల పై తానూ స్పందించలేనని చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలను సుప్రిత పోస్ట్ చేసింది. అసలు జరిగిన సంఘటనలో ఎంత నిజం ఉందో పోలీసుల విచారంలో తేలనుంది. అయితే భార్గవ్‌ మాజీ ప్రేయసి, అలాగే అతని స్నేహితులు కూడా అతడు మంచివాడు కాదంటూ ఆరోపణలు చేయడం ఇప్పుడు అతని పీకల మీదకు వచ్చేలా ఉంది. మొత్తమ్మీద భార్గవ్ కి సంబంధించిన మొత్తం ఆరోపణల్లో తేలింది ఏమిటంటే.. భార్గవ్ పెద్ద స్త్రీ లోలుడు అని, అతడు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వీడియోల కోసం వాడుకునేవాడని.. అతను కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు ఒకలా, ఆఫ్‌లో ఉన్నప్పుడు మరోలా ఉంటాడని అతని పై విమర్శలు చేశారు.