యాంకర్ రష్మీ.. సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చాలా పాపులర్. వీరిద్దరు జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరు విడిగా కంటే జంటగా ఎక్కువగా పాపులర్ అయ్యారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందనే గుసగుసలు విన్పించాయి. ఈ పుకార్లను రష్మి-సుధీర్ చాలాసార్లు ఖండించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
సుధీర్-రష్మీ మధ్య లవ్ ట్రాక్ నడిచిన ప్రతీసారి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో వీరిద్దరు పాల్గొనే ప్రతీ షోలోనూ ఇలాంటి లవ్ ట్రాక్.. పెళ్లి ఎపిసోడ్ ను నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరు కూడా బుల్లితెరపై ఎలాంటి మొహమాటలు లేకుండా రోమాన్స్ పండిస్తుండటంతో రష్మీ-సుధీర్ల మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లకు బలం చేకూరుతోంది.
Also Read: సింగిల్ సిట్టింగ్లో పవన్ చేత ఓకే చెప్పించుకున్న దర్శకుడు
రష్మీ-సుధీర్ మధ్య పుట్టికొస్తున్న పుకార్లతో వీరిద్దరికి కావాల్సిన పబ్లిసిటీ ఫ్రీగా దొరకుతుంది. దీంతో వీరిద్దరి అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా గెటప్ శ్రీను యాంకర్ రష్మీ-సుధీర్ మధ్య ఎఫైర్ గుట్టు విప్పాడు. తాజాగా జరిగిన ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌లో సుధీర్-రష్మీల లవ్ మ్యాటర్ ఓపెన్ చేశాడు.
Also Read: కెవ్వు కార్తీక్ కథ ఎమోషనల్.. నెట్టింట్లో వైరల్..