రాజకీయాల్లో కొందరు నేతలు తెలుగు మాట్లాడడం ఇబ్బంది పడుతుంటారు. కొందరికి అసలు తెలుగు సరిగా రాదు కూడా. ఇంకొందరైతే తమ స్పీచ్‌లతో దుమ్మురేపుతుంటారు. అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఎప్పుడెప్పుడు మాట్లాడుతారా అని అక్కడి టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారట. అదేంటి.. జగన్ స్పీచ్ కోసం టీడీపీ నేతలు ఎందుకు ఎదురుచూస్తున్నారా అని అనుకుంటున్నారా..?
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వచ్చీరాని తెలుగు భాషతో వైసీపీ నేతలకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవారు. లోకేష్‌పై వైసీసీ శ్రేణులు వాడిన అస్త్రాన్నే ఇప్పుడు సీఎం జగన్‌పై టీడీపీ నేతలు వాడుతున్నారు. అయితే లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేస్తే.. సీఎం జగన్‌ను మాత్రం ఏకంగా టీడీపీ అగ్రనేతలు ట్రోల్ చేస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడిన తెలుగు తప్పులను వెతికి ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.
Also Read: విజయవాడపై కొత్త ప్రతిపాదన ఇదీ
తాజాగా.. ఆదివారం సీఎం జగన్ చేసిన ప్రసంగంలో తెలుగు తప్పులను వెతికారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ‘ఏం భాష స్వామి అది!’ అంటూ వీడియో విడుదల చేశారు. అనంతరం టీడీపీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు ఓ రేంజ్‌లో సీఎం జగన్‌పై ట్రోలింగ్ చేపట్టారు. ఆ వీడియోలో ‘అక్కచమ్మలు, అక్క అంశం, సమర్భవించ వచ్చా, సమాస స్వేచ్ఛ’ అంటూ సీఎం జగన్ తెలుగు పదాలను తప్పుగా ఉచ్ఛరించారని ఎద్దేవా చేశారు.
Also Read: దేశంలోనే ఏపీకి అత్యంత అన్యాయం: జగన్
టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, దీపక్ రెడ్డి, గాలి భానుప్రకాష్, మంతెన రామరాజు, ఎన్.అమర్‌నాథ్ రెడ్డి, గద్దె రామ్మోహన్, కె.జవహర్, బండారు సత్యనారాయణ మూర్తి, జీవీ ఆంజనేయులు, ఎంఎస్ రాజు, చింతమనేని ప్రభాకర్, బుద్దా వెంకన్న, పంచుమర్తి అనురాధ, బీటీ నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బచ్చుల అర్జునుడు.. ఇతర టీడీపీ నేతలు ఒకే వీడియో, ఒకే కామెంట్ ట్వీట్లు చేసి సీఎం జగన్‌పై ట్రోలింగ్‌కు దిగారు.
ఏం భాష స్వామి అది! pic.twitter.com/jpmHTC31rN
— Kinjarapu Atchannaidu (@katchannaidu) November 1, 2020