https://oktelugu.com/

బీజేపీకి గట్టి దెబ్బ.. రూ.కోటి తరలిస్తుండగా రఘునందన్ బావమరిది అరెస్ట్

దుబ్బాక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. రేపటి నుంచి ఓటర్లకు డబ్బులు, మద్యం పంచేందుకు పార్టీలు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా రూ.కోటి నగదుతో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది హైదరాబాద్ పోలీసులకు చిక్కడం సంచలనమైంది. మాజీ ఎంపీ, బీజేపీ నేత గడ్డం వివేక్ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఈ రూ.కోటి నగదును తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఈ కేసు రఘునందన్ రావుతోపాటు మాజీ ఎంపీ వివేక్ కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 06:42 PM IST
    Follow us on

    దుబ్బాక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. రేపటి నుంచి ఓటర్లకు డబ్బులు, మద్యం పంచేందుకు పార్టీలు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా రూ.కోటి నగదుతో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది హైదరాబాద్ పోలీసులకు చిక్కడం సంచలనమైంది. మాజీ ఎంపీ, బీజేపీ నేత గడ్డం వివేక్ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఈ రూ.కోటి నగదును తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఈ కేసు రఘునందన్ రావుతోపాటు మాజీ ఎంపీ వివేక్ కూడా చుట్టుకునేలా ఉంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    దుబ్బాక ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది.. హవాలా నగదు తరలింపు వ్యవహారంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ , బేగంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ కూడా ఒకరు బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది కాగా.. మరొకరు ఆయన డ్రైవర్ కావడం గమనార్హం.

    Also Read: హైదరాబాద్‌ కేంద్రంగా బీజేపీ కుట్ర.. కేటీఆర్‌‌ సంచలన వ్యాఖ్యలు

    రూ.కోటి నగదు తరలిస్తున్న ఘటనలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, అతడి డ్రైవర్ రవికుమార్ ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు బషీర్ బాగ్ కార్యాలయంలో మీడియాకు హవాలా నగదు తరలింపు వ్యవహారంపై మాట్లాడారు.

    సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు రూ.కోటి నగదును తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. సురభి శ్రీనివాసరావు నగదు తీసుకెళ్తుండగా అతడితోపాటు డ్రైవర్ రవికుమార్ ను పట్టుకున్నాం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు శ్రీనివాసరావు బావమరిది. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నగదు దుబ్బాక ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు శ్రీనివాసరావు విచారణలో అంగీకరించారు. ఆ డబ్బును మాజీ ఎంపీ వివేక్ మేనేజర్ ఇచ్చినట్లు నిందితులు తెలిపారు. నగదు, కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరుపుతాం’ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

    Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెడీ!

    పోలీసులు దుబ్బాక ఎన్నికల వేళ ఈ నగదు పట్టుకోవడం బీజేపీని చావుదెబ్బ తీసినట్టైంది. ఇక ఇది టీఆర్ఎస్ కుట్ర అని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ బీజేపీని ముప్పుతిప్పలు పెడుతూ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నట్టు తెలుస్తోంది.