https://oktelugu.com/

నో షేవ్ నవంబర్ కథ తెలుసా.. గడ్డం పెంచుకోవడం వల్ల ఉపయోగాలివే..?

ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నో షేవ్ నవంబర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. చాలామంది అబ్బాయిలు నవంబర్ నెలలో గడ్డం చేయించుకోరు. ఈ నెలంతా గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. నో షేవ్ నవంబర్ అని చెబుతూ గడ్డం చేయించుకోమని అవతలి వ్యక్తులకు చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి నవంబర్ నెలలో గడ్డం పెంచుకోవడం వనుక అసలు కారణం తెలీదు. అమెరికాకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి చనిపోయిన తరువాత ఆయన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2020 / 04:43 PM IST
    Follow us on


    ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నో షేవ్ నవంబర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. చాలామంది అబ్బాయిలు నవంబర్ నెలలో గడ్డం చేయించుకోరు. ఈ నెలంతా గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. నో షేవ్ నవంబర్ అని చెబుతూ గడ్డం చేయించుకోమని అవతలి వ్యక్తులకు చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి నవంబర్ నెలలో గడ్డం పెంచుకోవడం వనుక అసలు కారణం తెలీదు.

    అమెరికాకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి చనిపోయిన తరువాత ఆయన ఎనిమిది మంది కొడుకులు నో షేవ్ నవంబర్ ను ప్రారంభించారు. నో షేవ్ నవంబర్ ద్వారా షేవింగ్, ట్రిమ్మింగ్ చేయించుకోకుండా ఆ డబ్బును క్యాన్సర్ బాధితులకు విరాళంగా ఇస్తారు. 2009 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో క్యాన్సర్ వ్యాధి ఎంతోమంది ప్రాణాలను కబళిస్తోంది.

    అలాంటి వాళ్ల ప్రాణాలను కాపాడటం కోసం నో షేవ్ నవంబర్ ప్రారంభమైంది. ఇలా ఆదా చేసిన డబ్బును క్యాన్సర్ బాధితులకు సహాయం చేస్తున్న స్వచ్చంద సంస్థలకు ఇస్తారు. మాథ్యూ హిల్ అనే వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోగా తమ తండ్రిలా మరి కొంతమంది క్యాన్సర్ తో చనిపోకూడదని భావించి నో షేవ్ నవంబర్ ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఉద్యోగులు, విద్యార్థులు నో షేవ్ నవంబర్ ను ఫాలో అవుతూ ఉంటారు.

    అయితే గడ్డం ఇలా పెంచడం వల్ల కొత్త లుక్ వస్తోందని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తమకు గడ్డం పెంచుకోవాలానే కోరిక ఉన్నా సాధారణ రోజుల్లో వీలు కాదని నో షేవ్ నవంబర్ వల్ల గడ్డం పెంచుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.