పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వందల కోట్ల వ్యవహారం. సినిమా హిట్టైతే అయితే ఎంత లాభముంటుందో ఫ్లాప్ అయితే అంతే భారీ నష్టాలు మిగులుతాయి. అందుకే పవన్ తన కథలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంత ఈజీగా ఆయన చేత ఓకే చెప్పించలేరు. కేవలం కథ విని ఫైనల్ చేయడానికే పవన్ కొన్ని నెలల సమయం తీసుకుంటారు. అన్ని విధాలా ఖచ్చితంగా ఉంది అనిపిస్తేనే చిత్రీకరణకు వెళ్తారు. అందుకే కథ చెప్పి ఆయన్ను ఒప్పించడం అంత ఈజీ కాదు అంటుంటారు చాలామంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
కథా చర్చల వద్దనే దర్శకుడితో సింక్ అయిపోతారు పవన్. అలా సింక్ అయి చేసిన సినిమాలు బాగానే ఆడాయి. మిగతావే దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న పవన్ కథలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారట. ఆ క్రమంలోనే డైరెక్టర్లు గ్యాప్ లేకుండా ఆయన్ను కలుస్తూ కథలను ఓకే చేసుకునే కష్టపడుతున్నారు. కానీ హరీష్ శంకర్ మాత్రం కేవలం ఒక్క సిట్టింగ్లోనే పవన్ చేత కథను ఓకే చేయించుకున్నారట.
Also Read: వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
లాక్ డౌన్ సమయంలోనే హరీష్ శంకర్ పవన్‌కు స్టోరీ లైన్ చెప్పారు. అది బాగా నచ్చడంతో సినిమాను అనౌన్స్ చేశారు. ఇక మిగిలింది పూర్తి స్క్రిప్ట్ రాయడమే. పవన్ సంగతి బాగా తెలిసిన హారీష్ శంకర్ అన్ని హంగులను జోడించి ఫుల్ స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళారట. ఆ సిట్టింగ్లోనే కథ ఆమోదం పొందిందట. పవన్ నుండి ఒక్క మీటింగ్లోనే ఆమోదం తీసుకున్నాడు అంటే హరీష్ శంకర్ ఎంత బలమైన స్టోరీ చెప్పి ఉంటాడో అని అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రజెంట్ ‘వకీల్ సాబ్’ చేసిన పవన్ త్వరలోనే ‘అయ్యపనుమ్ కోషియుమ్’ ఆతర్వాత క్రిష్ చిత్రం చేయనున్నారు. ఆ రెండూ పూర్తయ్యాక హరీష్ శంకర్ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.