బీసీసీఐ అధ్యక్షుడు.. ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి మరోసారి గుండెపోటు వచ్చింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఈరోజు ఛాతినొప్పి రావడంతో గంగూలీని కుటుంబ సభ్యులు కోల్ కతాలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై ఆస్పత్రి వైద్యుల నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జనవరి 7న ఉదయం ఎక్సర్ సైజులు చేస్తుండగా ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రిలో గంగూలీ చేరాడు. ఈ క్రమంలోనే ఆయన గుండెలో మూడు చోట్ల రక్తనాళాలు మూసుకుపోయాయని గుర్తించి ఆస్పత్రి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ఒక స్టంట్ వేసి అనంతరం మరో రెండు స్టంట్లు వేశారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
గంగూలీకి మరోసారి గుండెపోటు అని తెలియగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.