కాంగ్రెస్ ప్రక్షాళన.. సోనియా సంచలనం?

100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. బీహార్ లో బొక్కా బోర్లా పడింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కేవలం 2 సీట్లు సాధించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అధికారం కోల్పోయింది. అసలు బీజేపీ ముందు నిలబడలేకపోతోంది. అందుకే కాంగ్రెస్ ప్రక్షాళనకు అధ్యక్షురాలు సోనియాగాంధీ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈనెల 19న శనివారం సోనియాగాంధీ పార్టీలోని అసమ్మతి నాయకులతో కీలక సమావేశానికి రెడీ అవుతున్నారు. గత ఆగస్టులో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్ తోపాటు 23మంది నేతలు ఏకంగా […]

Written By: NARESH, Updated On : December 18, 2020 8:33 pm
Follow us on

100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. బీహార్ లో బొక్కా బోర్లా పడింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కేవలం 2 సీట్లు సాధించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అధికారం కోల్పోయింది. అసలు బీజేపీ ముందు నిలబడలేకపోతోంది. అందుకే కాంగ్రెస్ ప్రక్షాళనకు అధ్యక్షురాలు సోనియాగాంధీ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈనెల 19న శనివారం సోనియాగాంధీ పార్టీలోని అసమ్మతి నాయకులతో కీలక సమావేశానికి రెడీ అవుతున్నారు. గత ఆగస్టులో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్ తోపాటు 23మంది నేతలు ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అది కాంగ్రెస్ లో ఓ కుదుపు కుదిపింది. పార్టీ అగ్రనేతలు చిదంబరం, కపిల్ సిబల్ కూడా బాహాటంగా
పార్టీ ప్రక్షాళన చేయాలని సూచించడంతో సోనియాగాంధీ ఈ శనివారం పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించినట్టు సమాచారం.

Also Read: బీజేపీ డ్యూయెల్‌ రోల్‌..: అటు రైతులతో, ఇటు సీఎంలతో చర్చలు

ఈ అసమ్మతి నాయకులతో భేటిని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని.. ఆయన సలహాతోనే సోనియా సమావేశం అవుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ కొత్త అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సోనియా ఉన్నట్టు సమాచారం. అసమ్మతి నేతలతో సయోధ్య కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

రెబల్స్ తో మీటింగ్ తర్వాత పార్టీ ప్రక్షాళన ఉంటుందని చర్చ జరుగుతోంది. అసమ్మతి నాయకులతో భేటిలో రాహుల్, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.దీంతో సమావేశం వాడివేడిగా సాగడం ఖాయమని తెలుస్తోంది. అసమ్మతి నాయకులు మెత్తబడుతారా? సోనియా ప్రతిపాదనలకు తలొగ్గుతారా? అన్నది చూడాలి.

Also Read: వ్యవసాయ చట్టాల ప్రతులను కేజ్రీవాల్ ఎందుకు చించేశారంటే?

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవచ్చన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం రాహుల్ కాకుండా మరొకరు రావచ్చు. ఇక రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను కూడా మారుస్తారని ఈ శనివారం ప్రకటిస్తారని అంటున్నారు. తెలంగాణ పీసీసీ రేసులో ప్రధానంగా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు కనిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎవరు అవుతారన్నది రేపటితో తేలనుంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్