https://oktelugu.com/

టీజర్ టాక్: ఈ ఊరమాస్ ప్రొఫెసర్… సో డేంజరస్

దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన తమిళ టీజర్ సౌత్ ఇండియా రికార్డ్స్ నెలకొల్పింది. కాగా నిన్న మాస్టర్ తెలుగు టీజర్ విడుదల చేశారు చిత్ర బృందం. నిమిషానికి పైగా సాగిన మాస్టర్ టీజర్… ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంది. ముఖ్యంగా విజయ్ లుక్ మరియు మాస్ అప్పీల్ హైలెట్ గా ఉన్నాయి. టీజర్ చూస్తుంటే మాస్టర్ మూవీలో విజయ్ రోల్ […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 11:17 AM IST
    Follow us on


    దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన తమిళ టీజర్ సౌత్ ఇండియా రికార్డ్స్ నెలకొల్పింది. కాగా నిన్న మాస్టర్ తెలుగు టీజర్ విడుదల చేశారు చిత్ర బృందం. నిమిషానికి పైగా సాగిన మాస్టర్ టీజర్… ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంది. ముఖ్యంగా విజయ్ లుక్ మరియు మాస్ అప్పీల్ హైలెట్ గా ఉన్నాయి. టీజర్ చూస్తుంటే మాస్టర్ మూవీలో విజయ్ రోల్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని అనిపిస్తుంది.

    Also Read: బిగ్‌బాస్‌ రన్నరప్‌ కోసం హోరాహోరీ

    స్టూడెంట్స్ కి మించిన రోగ్ అండ్ రెడిక్యులస్ గా విజయ్ పాత్రను పరిచయం చేశాడు. కాలేజీ ప్రొఫెసర్ రౌడీ వేషాలు కథపై ఆసక్తి కలిగిస్తున్నాయి. బలమైన నేపథ్యం కలిగిన జేడీ… ప్రొఫెసర్ గా కాలేజీలోకి ఎందుకు అడుగుపెట్టాడు అనేది కథలో కీలకంగా మారే అవకాశం ఉంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, విజయ్ కి ప్రత్యర్థికగా నటిస్తుండగా… అతనికి అడ్డుపడుతూ చిరాకు తెప్పించే పంతులుగా ఆయన పాత్ర ఉంది. ఆధిపత్యం కోసం వీరి మధ్య జరిగే యుద్ధం తెరపై ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక హీరోయిన్ మాళవిక మోహన్ అందాలు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బీజీఎమ్ కూడా టీజర్ లో ఆకట్టుకున్న అంశాలు.

    Also Read: బిగ్ బాస్ చెక్ తో బంగారం కొన్న గంగవ్వ.. ఎంత ఇచ్చారో తెలుసా?

    పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా కాలంగా మాస్టర్ ఓ టి టి లో విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అయితే మాస్టర్ మూవీ థియేటర్స్ లోనే విడుదల చేస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. ఖైదీ చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించిన లోకేష్ కనకరాజ్ నుండి వస్తున్న మాస్టర్ మరో సంచలన విజయం నమోదు చేసే అవకాశం కలదు. ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకునే నేపథ్యంలో సంక్రాంతి బరిలో మాస్టర్ దిగే అవకాశం ఉంది. జేవియర్ బ్రిట్టో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా… ప్రైమ్ ఓటిటి హక్కులు దక్కించుకుంది. థియేటర్ విడుదల అనంతరం మాస్టర్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్