ఇదేం డీపీఆర్‌‌..: ఏపీకి ‘జల’క్‌

ఫాఫం.. అదేంటో కానీ జగన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికే జగన్‌ సర్కార్‌‌ చేసిన పలు చట్టాలను కేంద్రం రివర్స్‌ పంపించగా.. తాజాగా ఓ ప్రాజెక్టు డీపీఆర్‌‌ విషయంలోనూ సీరియస్‌ అయింది. కనీస అవగాహన లేకుండా డీపీఆర్‌లు తయారు చేయడం ఏమిటని కేంద్రం ఫైర్‌‌ అయింది. దీంతో ఆ డీపీఆర్‌‌ను కూడా రివర్స్‌ పంపించింది. Also Read: దివీస్‌ విషయంలో టీడీపీ, వైసీపీ యూటర్న్‌ రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం.. సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టాలనుకుంది. […]

Written By: Srinivas, Updated On : December 18, 2020 11:05 am
Follow us on


ఫాఫం.. అదేంటో కానీ జగన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికే జగన్‌ సర్కార్‌‌ చేసిన పలు చట్టాలను కేంద్రం రివర్స్‌ పంపించగా.. తాజాగా ఓ ప్రాజెక్టు డీపీఆర్‌‌ విషయంలోనూ సీరియస్‌ అయింది. కనీస అవగాహన లేకుండా డీపీఆర్‌లు తయారు చేయడం ఏమిటని కేంద్రం ఫైర్‌‌ అయింది. దీంతో ఆ డీపీఆర్‌‌ను కూడా రివర్స్‌ పంపించింది.

Also Read: దివీస్‌ విషయంలో టీడీపీ, వైసీపీ యూటర్న్‌

రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం.. సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టాలనుకుంది. దానికి టెండర్లు కూడా పిలిచింది. కానీ.. ఎన్జీటీలో స్టే వచ్చింది. అదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వం కూడా డీపీఆర్ సమర్పించి.. అపెక్స్ కౌన్సిల్‌లో పర్మిషన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రాష్ట్రం నుంచి పంపారు అధికారులు. ఇలా డీపీఆర్ పంపగానే.. అలా రివర్స్‌లో తిరిగొచ్చింది. డీపీఆర్‌లో ప్రాథమిక సమాచారం కూడా లేదని రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్ విభాగంపై కేంద్ర జల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతేకాదు.. ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఎలా సమర్పించాలో కేంద్ర జల సంఘం వెబ్ సైట్‌లో చూసి అవగాహన పెంచుకోవాలని సూచించింది. డీపీఆర్‌లో సాంకేతిక–ఆర్థిక అంశాల సమాచారమే లేదని.. హైడ్రాలజీ, అంతరాష్ట్ర అంశాలు, సాగు ప్రణాళికా డిజైన్, డిజైన్ అంచనా వ్యయానికి సంబంధించిన అంశాలూ.. డ్రాయింగ్స్ ఏమీ లేకుండా డీటైల్డ్ అని ఎలా అంటారని ప్రశ్నించింది. మొత్తం వివరాలతో మళ్లీ డీపీఆర్ పంపాలని ఆదేశించింది.

Also Read: జగన్‌తో ట్వంటీ ట్వంటీ ఆడేసుకున్న 2020

సాగునీటి ప్రాజెక్టులు, బహుళార్థసాధక ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ఎలా రూపొందించాలో కేంద్ర జల సంఘం 2010లో నిబంధనలు విడుదల చేసింది. ఫార్మాట్ కూడా.. వెబ్ సైట్ లో ఉంటుంది. అదేవిధంగా 2017 మార్గదర్శకాలు కూడా సీడబ్ల్యుసీ వైబ్ సైట్లో ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఆషామాషీగా ఓ లేఖ రాసినట్లుగా రాసేసి .. దానికి డీపీఆర్ పేరు పెట్టారు. దీంతో ఏపీ అధికారుల తీరు ఢిల్లీలో మరోసారి నవ్వుల పాలైంది. మరోసారి వివరంగా డీపీఆర్‌‌ పంపిస్తే అప్పుడు కేంద్రం ఆలోచన చేయనుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్