
జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కు తెలుగులో రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఏపీలో జరిగిన కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత కొన్నిరోజులు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు.
Also Read: గ్రేటర్ తీర్పు: ఏపీ బీజేపీ ఆశలపై నీళ్లు
అయితే ఏమైందో ఏమోగానీ రాపాక వరప్రసాద్ జనసేనలో ఉంటూ జగన్ నామజపం మొదలు పెట్టాడు. వీలుచిక్కినప్పుడల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తడం ప్రారంభించాడు. దీంతో రాపాక వరప్రసాద్ జనసేనకు హ్యండిచ్చాడనే పవన్ ఫ్యాన్స్ నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం రాపాక టెక్నికల్ గా జనసేనలో కొనసాగుతున్నప్పటికీ అతడి మనసంతా మాత్రం జగన్ చుట్టూనే తిరుగుతోంది.
ఈక్రమంలోనే రాపాక వరప్రసాద్ తన తనయుడు వెంకట్ రామ్ ను దగ్గరుండి వైసీపీలో చేర్పించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ సమక్షంలో వెంకట్ రామ్ వైసీపీ కండువా కప్పుకున్నాడు. గతంలో పవన్ సైతం రాపాక వరప్రసాద్ తమ పార్టీలో ఉన్నాడో లేదో అని చెప్పడంతో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా వైసీపీలోకి రాపాక తన తనయుడిని పంపించడం ద్వారా డైరెక్ట్ గానే సీఎం జగన్ కు జై కొట్టాడు.
Also Read: ఉత్తమ్ రిజైన్.. పీసీసీ ఎవరికి?
జనసేనలో ఉంటూ రాపాక వరప్రసాద్ శకుని పాత్ర పోషిస్తున్నా పవన్ కల్యాణ్ మాత్రం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తాను బ్రతికున్నంత వరకు జగన్ సీఎం అంటూ రాపాక కామెంట్స్ చేయడం సంచలనమైంది. రాపాక వ్యవహారం చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా జనసేనాని రాపాకను కట్టడి చేయకపోతే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్