https://oktelugu.com/

ప్రత్యామ్నాయం బీజేపే

హోరాహోరీగా సాగిన గ్రేటర్‌ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిన బీజేపీ టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తానేనని నిరూపించుకుంది. మేయర్‌‌ కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌‌ సీట్లు రాకపోయినా గత ఎన్నికలతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ స్థానాలు తన ఖాతాలో వేసుకున్నది. ఒకరకంగా టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్ చేసిందని చెప్పొచ్చు. Also Read: సర్వేలకు అందని గ్రేటర్‌‌ ఓటరు నాడి కలిసొచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 5, 2020 12:03 pm
    Follow us on

    BJP
    హోరాహోరీగా సాగిన గ్రేటర్‌ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిన బీజేపీ టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తానేనని నిరూపించుకుంది. మేయర్‌‌ కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌‌ సీట్లు రాకపోయినా గత ఎన్నికలతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ స్థానాలు తన ఖాతాలో వేసుకున్నది. ఒకరకంగా టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్ చేసిందని చెప్పొచ్చు.

    Also Read: సర్వేలకు అందని గ్రేటర్‌‌ ఓటరు నాడి

    కలిసొచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత

    బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన బీజేపీ అదే ఊపుతో గ్రేటర్‌‌ బరిలో దిగింది. నగరంలో ఎన్నికలు కొన్ని రోజుల ముందే వరదలు రావడం కూడా ఈ పార్టీకి కలిసొచ్చింది. వరదలు వచ్చినప్పుడు టీఆర్‌‌ఎస్‌ పెద్దలు ప్రజలను పట్టించుకోలేదు. సాయం ప్రకటించినా చాలామందికి అందలేదు. పైగా కొందరు నేతలు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఎల్‌ఆర్‌‌ఎస్‌ పేరిట ప్రజలపై భారం వేయడం కూడా టీఆర్‌‌ఎస్‌కు మైనస్‌గా మారాయి. వీటిని క్యాష్‌ చేసుకున్న బీజేపీ.. ప్రభావం చూపగలిగింది. వరద ప్రభావిత ప్రాంతాలు అన్ని చోట్లా టీఆర్ఎస్ పరాజయం పాలుకావడం గమనార్హం.

    టీఆర్‌‌ఎస్‌ కీలక నేతలకు షాక్‌

    గ్రేటర్‌లో బాధ్యతలు తీసుకున్న టీఆర్ఎస్ కీలక నేతలకు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్‌చార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న అడిక్‌మెట్‌, మంత్రి సబితా రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆర్కే పురంలో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భార్య బేతి స్వప్న , ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మరదలు కూడా ఓడిపోయారు. మాజీ మంత్రి నాయిని అల్లుడు కూడా పరాజయం పాలయ్యారు.

    Also Read: ఉత్తమ్‌ రిజైన్.. పీసీసీ ఎవరికి?

    పట్టువిడువని ఎంఐఎం

    మజ్లిస్‌కు పాతబస్తీలో ఎదురు లేదని మరోసారి నిరూపించుకున్నది. అధికారంలో ఉన్న పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. హిందూ ఓట్లు చీలేలా.. వ్యూహంతో వెళ్తున్న ఆ పార్టీ మరోసారి సక్సెస్‌ అయ్యింది. దాదాపుగా సిట్టింగ్ సీట్లన్నింటినీ నిలబెట్టుకుంది. అయితే ఈ సారి మేయర్‌‌ ఎన్నికలో ఎంఐఎం పార్టీ కీలకంగా మారనుంది. టీఆర్ఎస్‌కి మేజిక్ మార్క్‌కి తగ్గట్లుగా సీట్లు లభించలేదు. ఎక్స్ అఫిషియో ఓట్లతోనూ మేయర్ సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మజ్లిస్‌తో సపోర్ట్‌తోనే పీఠంపై కూర్చోనుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్