గ్రేటర్ ఓటరు నాడిని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోయాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో వాటి అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్కటని కాదు.. ఏ సంస్థ కూడా కరెక్ట్ ఫలితాలు చెప్పలేకపోయింది. దీంతో ఆయా పార్టీలు సైతం ఒరిజినల్ ఫలితాలు చూసి షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా 100 సీట్లు వస్తాయని అంచనా వేసుకున్న టీఆర్‌ఎస్ నేతల రిజల్ట్ తర్వాత తలలుపట్టుకున్నారు.
Also Read: బీజేపీకి అసలైన పరీక్ష నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. సత్తా చాటుతుందా?
టీఆర్‌ఎస్‌కు మొగ్గు చూసినా..
గ్రేటర్ ఎన్నికలు ముగియగానే ఆరా, పీపుల్స్ పల్స్, మిషన్ చాణక్య, సీపీఎస్, ఎన్‌ఎఫ్‌వో అంటూ..అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దాదాపు అన్ని కూడా టీఆర్ఎస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పాయి. కొన్ని సర్వేలైతే ఏకంగా 100 సీట్లు రావడం ఖాయమని ప్రకటించారు. బీజేపీకి కొన్ని సంస్థలు 12 నుంచి 25 లోపు ప్రకటిస్తే కొన్ని 30 దాటొచ్చని చెప్పారు. కానీ, వీటి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ 48 సీట్లు సాధించింది.
99 నుంచి 56కు..
గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన టీఆర్ఎస్ ఈ సారి 56 స్థానాలకు పడిపోయింది. సర్వేలు మాత్రం 85 నుంచి 105 మధ్య వస్తాయంటూ అంచనా వేశాయి. ఊహించని ఫలితాలు రావడంతో పార్టీ అగ్ర నేతలే షాక్ అయ్యారు. కనీసం మేయర్‌కు కావాల్సిన మేజిక్ ఫిగర్ కూడా రాకపోవడంతో నర్వస్ అయ్యారు. సింగిల్ లార్జెస్టెడ్ పార్టీ అని చెబుతున్నా.. దాదాపు 43 సీట్లు తగ్గడం అంటే మామూలు విషయం కాదు.
Also Read: టీఆర్ఎస్ మేయర్ వ్యూహం ఏంటి?
సర్వే సంస్థలకు సరిపడా వనరులు ఉన్నాయా..?
గ్రేట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని సర్వే చేసిన సంస్థలన్నీ సింగిల్ షట్టర్‌లో ఉండేవే. ఏది కూడా కావాల్సినంత సిబ్బంది, ఇతర వనరులతో ఉండదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా పార్టీ దగ్గరి నుంచి కొంత డబ్బు తీసుకొని సర్వే చేస్తుంటాయి. లక్ష శాంపిల్స్, 5 లక్షల శాంపిల్స్, 20 లక్షల శాంపిల్స్ అంటూ చెబుతారు కానీ, అంత ఉండదు. 5 వేల నుంచి 10 వేల మందిని అడిగితే ఎక్కువ. కొన్ని సంస్థలైతే ఎలాంటి సర్వే చేయకుండా రిపోర్టులు ఇస్తుంటాయి.. నమ్మారో… గ్రేటర్ ఎన్నికల పరిస్థితే ఎదురవుతుంది..
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్