కరోనా వైరస్ విజృంభిస్తున్న టైం అదీ. దేశంలో కేసులు రోజుకు లక్ష.. ఏపీలో రోజుకు 10వేలు దాటుతున్న విపత్కర పరిస్థితి. ఆ టైంలో జనాలంతా హాహాకారాలు చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. కరోనా కేసులు తగ్గిపోయాయి. అందరికీ కరోనాను రోగనిరోధక శక్తి వచ్చేసింది. ఇప్పుడు పెండ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లు అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. జనాలకు దాదాపుగా కరోనాను ఎదుర్కొనే శక్తి వచ్చింది.
Also Read: తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు?
ఇక రాబోయే వేసవి కాలం. ఈ జనవరి గడిస్తే ఇంత వేడిలో కరోనా మరింత క్షీణిస్తుంది. అందుకే దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తున్నా వేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించకపోవడం విశేషంగా చెప్పవచ్చు.
తాజాగా చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి లేదని దాదాపు 4వ వంతు ప్రజలు సర్వేలో చెప్పడం విశేషం. కొత్తగా వస్తున్న జోబైడెన్ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రజలకు వ్యాక్సిన్ వేస్తామంటూ పావు వంతు ప్రజలు ఆసక్తి లేదనడం గమనార్హం. కరోనా దెబ్బకు అత్యంత దెబ్బతిన్న దేశంలో ప్రజల తీరులో ఈ మార్పు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కేసీఆర్ సమాలోచన.. సుప్రీంకు వెళుతారా?
ఇక దేశంలోనూ అదే నిర్లిప్తత కనపడుతోంది. భారతీయుల్లో కరోనా వ్యాక్సిన్ పట్ల అస్సలు ఆసక్తి లేదని ఓ సర్వే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. దేశంలో వ్యాక్సిన్ వస్తే వేసుకుంటారా? అనే అంశంపై సర్వే చేస్తే.. ఈ సర్వేలో కేవలం 47శాతం మంది మాత్రమే తాము వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుపడం విశేషం. రాగానే వేసుకుంటామన్నారు. 53శాతం మంది ఇంకా ఎలాంటి అభిప్రాయానికి రాలేదంట.. వ్యాక్సిన్ ఫలితాలు చూసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామని 43శాతం మంది చెప్పగా.. కేవలం 10శాతం మంది మాత్రమే తాము వ్యాక్సిన్ తీసుకోమని ఓపెన్ గా చెప్పారు.
కరోనా తీవ్రత దశ దాటిపోయిందని ప్రజలందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. అందరికీ ఇమ్యూనిటీ వచ్చేసింది. వైరస్ ను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందని ప్రజలు భావిస్తున్నారు. అలాంటప్పుడు అంత అర్జంటుగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకని చాలా మంది అభిప్రాయపడ్డారు. వేడిగా ఉండే భారత్ లో కరోనా విజృంభించే అవకాశం లేవని ఇప్పుడు అర్జంటుగా వ్యాక్సిన్ వేసుకునే ఆసక్తి లేదని ప్రజలందరూ అంటున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్