https://oktelugu.com/

ప్రభాస్ అలాంటోడు అంటున్న పూజ.. వైరల్ అవుతున్న కామెంట్స్

హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకువెళుతుంది. ఆమె వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. రాధే శ్యామ్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ లాంటి స్టార్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్న పూజా… బాలీవుడ్ లో కూడా బడా ఆఫర్స్ అందుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న కబీ ఈద్ కబీ దివాలి మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికయ్యారు. అలాగే మరో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కి […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 01:02 PM IST
    Follow us on


    హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకువెళుతుంది. ఆమె వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. రాధే శ్యామ్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ లాంటి స్టార్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్న పూజా… బాలీవుడ్ లో కూడా బడా ఆఫర్స్ అందుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న కబీ ఈద్ కబీ దివాలి మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికయ్యారు. అలాగే మరో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్ అనే చిత్రంలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం విశేషం. అలా బాలీవుడ్ ని టాలీవుడ్ ని బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళుతుంది పూజా.

    Also Read: తారక్‌ భీమ్‌ టీజర్‌‌ రికార్డు

    కాగా తన కో స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే. షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ ప్రవర్తనా తీరు, మాట్లాడే విధానం తెలియజేసింది. ఓ హిందీ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ… ప్రభాస్ సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. ఆయన జోక్స్ వేస్తూ ఫన్నీగా ఉంటాడు. ఆయనతో పని చేయడం చాలా సరదాగా ఉంటుందని పూజా హెగ్డే అన్నారు. నిజానికి ప్రభాస్ తో పని చేసిన ప్రతి కో స్టార్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. తన హీరోయిన్స్ ని స్పెషల్ గా ట్రీట్ చేసే అలవాటు ఆయనకు ఉంది. సాహో మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రద్దా కపూర్ కోసం హైదరాబాద్ స్పెషల్ స్వీట్స్, నాన్ వెజ్ వంటకాలతో బడా ట్రీట్ ఇచ్చారట.

    Also Read: దిల్ రాజ్ ఫంక్షన్ కు నందమూరి హీరోలు ఎందుకు రాలేదు?

    అలాగే రాధే శ్యామ్ మూవీలో కీలక రోల్ చేస్తున్న భాగ్యశ్రీకి 15వంటకాలతో పెద్ద విందు భోజనం ఏర్పాటు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పారు. పాన్ ఇండియా స్టార్ గా భారీ ఇమేజ్ కలిగిన ప్రభాస్ తోటి నటుల పట్ల ఇంతటి గౌరవం చూపించడం గొప్ప విషయమే. మరోవైపు రాధే శ్యామ్ షూటింగ్ కొనసాగుతుంది. దర్శకుడు రాధా కృష్ణ సెన్సిబుల్ అండ్ పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్