వైరల్: వైఎస్ షర్మిల పార్టీ ఫ్లెక్సీ.. జగన్ కు షాక్ యేనా?

హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ అభిమానులతో జరుగుతున్న సమావేశం తెలంగాణ పాలిటిక్స్ ను వేడెక్కించింది. షర్మిల కొత్త పార్టీ పెట్టబోతోందని.. అందుకే ఈ భేటి అన్న ప్రచారం సాగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3వేల మంది వైఎస్ఆర్ అభిమాన నేతలు, కార్యకర్తలు హాజరు కాబోతున్నట్టు తెలిసింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతుందన్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ ఆఫీస్ లోటస్ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ […]

Written By: NARESH, Updated On : February 9, 2021 12:33 pm
Follow us on

హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ అభిమానులతో జరుగుతున్న సమావేశం తెలంగాణ పాలిటిక్స్ ను వేడెక్కించింది. షర్మిల కొత్త పార్టీ పెట్టబోతోందని.. అందుకే ఈ భేటి అన్న ప్రచారం సాగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3వేల మంది వైఎస్ఆర్ అభిమాన నేతలు, కార్యకర్తలు హాజరు కాబోతున్నట్టు తెలిసింది.

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతుందన్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ ఆఫీస్ లోటస్ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదిప్పుడు వైరల్ గా మారింది. లోటస్ పాండ్ వద్ద భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు షర్మిలకు జై కొడుతూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ ఫొటో ఎక్కడా లేకపోవడం గమనార్హం.

నిజానికి షర్మిల కొత్త పార్టీ ప్రచారం ముందే లీక్ అయిపోవడం ఆమెకు పెద్ద మైనస్ గా మారిందంటున్నారు. టీడీపీ అనుకూల మీడియా అధినేత తనపత్రికలో ఈ విషయం బయటపెట్టి వైసీపీని ఇరుకునపెట్టారు. ఈరోజు షర్మిల అందుకే పార్టీని డిక్లేర్ చేసి ఉండేవారని.. అందరినీ షాక్ కు గురిచేసి ఉండేవారని తెలుస్తోంది.

ఆ పత్రికాధినేత జగన్ కు, షర్మిలకు మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే తెలంగాణలో పార్టీ పెట్టేందుకు షర్మిల రెడీ అయ్యారని కథనం వేశాడు. అయితే దానిపై ఖండించిన షర్మిల ఇప్పుడు పార్టీ నేతలతో సమావేశం కావడం నిజంగానే ఆ కథనానికి బలం చేకూర్చినట్టైంది.

ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పెట్టి జగన్ అండ లేకుండా సొంతంగా ఎదగాలని షర్మిల భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని.. బ్రదర్ అనిల్ కు కూడా జగన్ నివాసానికి వెళితే అవమానం జరిగిందని ప్రచారం సాగుతోంది. అందుకే జగన్ బొమ్మ లేకుండా తెలంగాణలో పార్టీ పెట్టి నిలబడాలని వైఎస్ షర్మిల యోచిస్తున్నట్టు సమాచారం.