https://oktelugu.com/

కాంగ్రెస్ లో సంచలనం: టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి?

అనూహ్యమైన నిర్ణయాలు.. ఆశ్చర్యపరిచే వివాదాలకు దేశంలోని కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఏ నిర్ణయాన్ని అయినా నాన్చి నాన్చి ఎండగట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు టీపీసీసీ రేసును కూడా అలానే తీసుకున్నట్టు తెలిసింది. Also Read: మహేంద్ర సింగ్ ధోని ‘పంట’ పండింది! టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైన వేళ కాంగ్రెస్ లో మరో కల్లోలం మొదలైందంట.. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరడంతో ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2021 / 10:45 AM IST
    Follow us on

    అనూహ్యమైన నిర్ణయాలు.. ఆశ్చర్యపరిచే వివాదాలకు దేశంలోని కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఏ నిర్ణయాన్ని అయినా నాన్చి నాన్చి ఎండగట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు టీపీసీసీ రేసును కూడా అలానే తీసుకున్నట్టు తెలిసింది.

    Also Read: మహేంద్ర సింగ్ ధోని ‘పంట’ పండింది!

    టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైన వేళ కాంగ్రెస్ లో మరో కల్లోలం మొదలైందంట.. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరడంతో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ సీనియర్లు ససేమిరా అంటున్నారట.. వారందరూ తమ దారి తాము చూసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలిసింది.

    ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి నచ్చజెప్పి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఆయనను నియమించబోతున్నట్టు సమాచారం. ఇక టీపీసీసీ చీఫ్ గా సౌమ్యుడు.. అందరివాడు.. సీనియర్ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని చేయబోతున్నట్టు సమాచారం.

    Also Read: మిలియన్ మార్చ్.. కేసీఆర్ ను కొట్టడం కోదండరాంతో సాధ్యమేనా?

    ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ రేవంత్ రెడ్డికి మద్దతుగా అభిప్రాయాలు చెప్పారు. అతడే కాబోయే పీసీసీ చీఫ్ అన్న ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే సడెన్ గా జీవన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయబోతున్నారని వార్తలు రావడం కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురిచేస్తున్నాయి.

    ఇదే జరిగితే రేవంత్ రెడ్డి ఈ పదవిని స్వీకరిస్తారా? వదిలేస్తాడా? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. టీపీసీసీ ప్రకటన ఖచ్చితంగా కాంగ్రెస్ లో చీలిక తెప్పిస్తుందన్న వాదన వినిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్