https://oktelugu.com/

అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు రచ్చ చేస్తున్నారు..

బీజేపీ అంటే పక్కా హిందుత్వ అజెండా. ఆ పేటెంట్‌ హక్కులన్నీ కూడా బీజేపీవే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రతిపక్షాలు కూడా దాదాపు అదే ఆరోపిస్తూ ఉంటాయి. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ. అవును మరి ఎవరి సిద్ధాంతం వారిది. ఎవరి రాజకీయాలు వారివి. అయితే.. ఒకప్పుడు మత రాజకీయాలను సహించేది లేదంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గర్జించారు. కానీ.. అదేంటో ఇప్పుడు ఉన్నట్టుంది మాట మార్చేశారు. Also Read: కాంగ్రెస్ లో సంచలనం: […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2021 3:51 pm
    Follow us on

    chandrababu
    బీజేపీ అంటే పక్కా హిందుత్వ అజెండా. ఆ పేటెంట్‌ హక్కులన్నీ కూడా బీజేపీవే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రతిపక్షాలు కూడా దాదాపు అదే ఆరోపిస్తూ ఉంటాయి. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ. అవును మరి ఎవరి సిద్ధాంతం వారిది. ఎవరి రాజకీయాలు వారివి. అయితే.. ఒకప్పుడు మత రాజకీయాలను సహించేది లేదంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గర్జించారు. కానీ.. అదేంటో ఇప్పుడు ఉన్నట్టుంది మాట మార్చేశారు.

    Also Read: కాంగ్రెస్ లో సంచలనం: టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి?

    జై హిందుత్వం అంటున్నారు. ఒక్క నామాలు మాత్రం పెట్టుకోవడం లేదు కానీ.. హిందుత్వాన్ని జపించడంలో బీజేపీని మించి పోతున్నారు. నిజానికి రామతీర్థాలు విగ్రహ విధ్వంస ఘటన విషయంలో బీజేపీ ఒక మాదిరిగానే స్పందించింది. కానీ.. టీడీపీ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పావులు కదిపింది. ఏకంగా చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి ఏకంగా రామతీర్థానికి వచ్చారు. దీంతో తొలి షాక్ కాషాయం పార్టీకే తగిలింది.

    ఉమ్మడి ఏపీ విభజన తర్వాత విజయనగరం జిల్లాలోని రామతీర్థాలకు ఒకవిధంగా మహర్దశ వచ్చింది. ఎందుకంటే భద్రాచలం ఆలయం కాస్త తెలంగాణకు వెళ్లిపోగా.. ఈ ఆలయానికి ఉత్తరాంధ్రా భద్రాద్రిగా పేరుంది. అందుకే.. అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను రామతీర్థాలలో జరపాలని నాటి సీఎం చంద్రబాబుని కోరారు. కానీ.. చంద్రబాబు ససేమిరా అనడమే కాదు, కడప జిల్లా ఒంటిమెట్ట కోందండ రామాలయాన్ని ఎంపిక చేశారు. దాంతో ఈ ప్రాంతీయులు ఆస్తిక జనులు చాలా బాధపడ్డారు. కనీసం ఆలయాన్ని అభివృద్ధి చేయమన్నా కూడా అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు ఎన్నో సార్లు విజయనగరం జిల్లాకు వచ్చారు కానీ ఏనాడు రామతీర్థాలు ఎక్కడ ఉందని వాకబు చేయలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం రామతీర్థాలుకు విచ్చేసి అక్కడే అడ్డా పెట్టి మరీ ప్రభుత్వంపై రాజకీయ రచ్చ చేస్తున్నారు.

    Also Read: రామతీర్థం ఘటన.. జగన్ సంచలన నిర్ణయం

    ఈ దుర్ఘటనకు ఎవరు పాల్పడ్డారో కానీ.. రాముల వారి శిరస్సుని ఖండించడం మాత్రం దారుణమైన విషయం. అయితే.. ఈ రాజకీయ రచ్చ మాత్రం అంతకంటే దారుణంగా అభివర్ణిస్తున్నారు ప్రజలు. ఇలా రాముడి మీద ప్రేమ ఒలకబోస్తున్న రాజకీయ జీవులకు ప్రసాదం మీదనే భక్తి ఉందని కూడా సెటైర్లు పడుతున్నాయి. మరో మూడు నెలల్లో శ్రీరామ నవమి రాబోతోంది. ఇప్పటికైనా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి గట్టి నిఘా పెట్టాలని, ఉత్తరాంధ్రా ప్రజలంతా తరలివచ్చేలా రవాణా సదుపాయాలను పెంచాలని అంతా వైసీపీ సర్కార్‌‌ను కోరుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్