https://oktelugu.com/

అలిగినోళ్లందరికీ పార్టీ పదవులు..: అసంతృప్తులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు

ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రాజీనామా చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా.. కొత్త అధ్యక్షుడి నియామకం ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ పదవిలో కొత్త వారిని నియమించడానికి అధిష్టానానికి పెద్ద టాస్క్‌లా మారినట్లుగా తెలుస్తోంది. ఈ పదవి కోసం పార్టీలో పోటాపోటీ నెలకొనడంతో ఎవరిని సెలక్ట్‌ చేయాలనేది అర్థం కాకుండా ఉంది. Also Read: ప్లీజ్‌ సైలెన్స్‌.. :డిసెంబర్‌‌ 31 సెలబ్రేషన్స్‌కు తెలంగాణ పోలీసుల బ్రేక్‌ సోనియాపై ఒత్తిడి తెచ్చి మ‌రీ రాష్ట్ర […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 26, 2020 11:40 am
    Follow us on

    Telangana Congress
    ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రాజీనామా చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా.. కొత్త అధ్యక్షుడి నియామకం ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ పదవిలో కొత్త వారిని నియమించడానికి అధిష్టానానికి పెద్ద టాస్క్‌లా మారినట్లుగా తెలుస్తోంది. ఈ పదవి కోసం పార్టీలో పోటాపోటీ నెలకొనడంతో ఎవరిని సెలక్ట్‌ చేయాలనేది అర్థం కాకుండా ఉంది.

    Also Read: ప్లీజ్‌ సైలెన్స్‌.. :డిసెంబర్‌‌ 31 సెలబ్రేషన్స్‌కు తెలంగాణ పోలీసుల బ్రేక్‌

    సోనియాపై ఒత్తిడి తెచ్చి మ‌రీ రాష్ట్ర విభ‌జ‌న సాధించిన టీ కాంగ్రెస్ నేత‌లు ఇప్పటి వ‌ర‌కూ అక్కడ పార్టీని ఉద్ధరించింది ఏమీ లేదు. అంతేకాదు.. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండో ప్రత్యామ్నాయ స్థానానికి కూడా బీజేపీకి ధారపోస్తున్నట్లే కనిపిస్తోంది. గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అయితే.. ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి బీజేపీ బలం ఇద్దరు ఎమ్మెల్యేలే. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది.

    రాష్ట్రాన్ని విడ‌దీసి అటు ఏపీలో తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ తెలంగాణలో బాగుపడుతున్నదీ ఏమీ లేదు. ఈ ప‌రిస్థితుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామ‌కం మ‌రో ప్రహ‌స‌నంగా మారింది. ఎవ‌రొచ్చినా బోలెడ‌న్ని అస‌మ్మతి వ‌ర్గాలు పార్టీలో ఉండ‌నే ఉంటాయి. ఈ మాత్రం దానికి కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న క‌స‌ర‌త్తు మ‌రో కామెడీలా అనిపిస్తోంది.

    Also Read: సంచలనం.. కరోనాను జయించిన ‘ధారవి’..!

    ప్రస్తుతం అయితే టీపీసీసీ అధ్యక్ష ప‌ద‌వి విష‌యంలో రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్రమార్కల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవ‌రో ఒక‌రికి ఆ ప‌ద‌వి దక్కడం ఖాయం. అయితే.. వీరిలో ఎవ‌రికి ద‌క్కినా అలిగే వాళ్లలో మిగ‌తా ఇద్దరే కాదు.. డ‌జ‌న్ల మంది ఉంటారు. ఎవ‌రు అలిగినా మీడియాకు కూడా అదో సర‌దా అంశం అవుతుంది. అయితే.. ఈ మంటను చల్లార్చేందుకు అధిష్టానం తలో పదవిని పంచుతోందట. టీపీసీసీ ప్రెసిడెంట్‌తోపాటు మరికొంత మంది ఉపాధ్యక్షుడు ఉంటారట. ఇంకా బోలెడ‌న్ని ప‌ద‌వుల‌ను క్రియేట్ చేసి.. త‌లా ఒక‌టి పంచ‌నున్నార‌ట‌. అంటే.. అలిగిన ప్రతి ఒక్కరికి ఒక ప‌ద‌విని ఇవ్వనున్నార‌ట‌.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్