సౌదీ సంచలనం.. ప్రపంచంతో సంబంధాలు కట్..!

ఓ వైపు బ్రిటన్.. మరోవైపు దక్షిణాఫ్రికాలో కరోనా కొత్తరకం వైరస్ లు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహ్మమరితో ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. దీనికితోడు కరోనా కొత్తరకం వైరస్ లు ప్రజల్నీ మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. Also Read: మొదటిసారి మెట్టు దిగొచ్చిన మోడీ కరోనా ఎంట్రీతో ప్రపంచంలోని అన్నిదేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. లాక్డౌన్ 1.0.. లాక్డౌన్ 2.0.. లాక్డౌన్ 3.0 అంటూ క్రమేణ అన్ లాక్ దిశగా వెళ్లాయి. అయితే ఇప్పుడు కరోనా వంతుగా కన్పిస్తోంది. కరోనా సైతం […]

Written By: Neelambaram, Updated On : December 22, 2020 5:41 pm
Follow us on

ఓ వైపు బ్రిటన్.. మరోవైపు దక్షిణాఫ్రికాలో కరోనా కొత్తరకం వైరస్ లు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహ్మమరితో ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. దీనికితోడు కరోనా కొత్తరకం వైరస్ లు ప్రజల్నీ మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

Also Read: మొదటిసారి మెట్టు దిగొచ్చిన మోడీ

కరోనా ఎంట్రీతో ప్రపంచంలోని అన్నిదేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. లాక్డౌన్ 1.0.. లాక్డౌన్ 2.0.. లాక్డౌన్ 3.0 అంటూ క్రమేణ అన్ లాక్ దిశగా వెళ్లాయి. అయితే ఇప్పుడు కరోనా వంతుగా కన్పిస్తోంది. కరోనా సైతం తాజాగా కరోనా 2.0ను తీసుకొచ్చింది.

బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ తో భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీనిలో భాగంగా అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ దేశాల నుంచి విమాన రాకపోకలపై భారత్ సహా పలుదేశాలు డిసెంబర్ 31వరకు నిషేధం విధించాయి.

Also Read: గూగుల్ కు లేఖ రాసిన తెలంగాణ పోలీసులు.. ఎందుకంటే?

కరోనా కొత్తరకం వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్.. దక్షిణాఫ్రికా దేశాల విమానాలతోపాటు అన్ని దేశాల విమాన సర్వీసులపై సౌదీ నిషేధం విధించింది.అత్యవసర సమయాల్లో తప్పించి అన్ని విదేశీ విమానాల సర్వీసులపై వారంపాటు నిషేధించినట్లు ప్రకటించింది.

సముద్ర మార్గంలో.. భూ మార్గంలోనూ సౌదీకి వచ్చే అన్ని ప్రవేశాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజుల తర్వాత పరిస్థితులను బట్టి సౌదీ నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. అయితే కరోనా కొత్తరకం వైరస్ అత్యంత వేగంగా విజృంభిస్తుండటంతో మరికొన్ని రోజులు సౌదీ దీనిని పొడగించే అవకాశం కన్పిస్తోంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు