Homeఎంటర్టైన్మెంట్చిరుకు దోశ ఛాలెంజ్ విసిరిన చిలిపి సమంత

చిరుకు దోశ ఛాలెంజ్ విసిరిన చిలిపి సమంత

Chiranjeevi
అక్కినేనివారి కోడలుపిల్ల సమంత మెగాస్టార్ చిరంజీవిని సైతం ఇరుకున పెట్టింది. తన తికమక ప్రశ్నలతో ఆయనను మాయ చేసింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. సమంత హోస్ట్ చేస్తున్న ఈషో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుంది. సమంత బుల్లి బుల్లి మాటలతో అడిగే ఆసక్తికర ప్రశ్నలు అందరినీ అలరిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రానా, తమన్నా, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఈ షోకి అతిథులుగా విచ్చేశారు. సదరు స్టార్స్ గురించి సమంత తెలివిగా ఎవరికీ తెలియని సమాచారం రాబట్టారు.

Also Read: పవన్ డైరెక్టర్ కు త్రివిక్రమ్ వార్నింగ్!

తాజాగా సమంత సామ్ జామ్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో సమంత, చిరు మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. మీ ఫ్రిజ్ లో ఎప్పుడూ ఉంటే ఐటెం ఏమిటని అడిగారు సమంత? దానికి చిరు ఇచ్చిన చేతి సైగ నవ్వులు పూయించింది. కాగా ఈ కార్యక్రమంలో చిరుతో సమంత దోశలు వేయించడం విశేషం. దోశ వేసి దానిని మీరు తిప్పాలి అనే ఛాలెంజ్ ని చిరుకి సమంత విసిరారు. చిరు తన ప్రత్యేకత చాటుకుంటూ, కళ్ళకు గంతలు కట్టుకొని తిప్పుతా అన్నారు. సహజంగా వంట చేయడాన్ని ఇష్టపడే చిరంజీవి సమంత ఛాలెంజ్ ని ఎంజాయ్ చేశారు.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నప్రశాంత్ నీల్

ఇక ఈ ఎపిసోడ్ ఒక వికలాంగ బాలుడు చిరంజీవి పెయింట్ అద్బుతంగా వేశాడు. ఆ బాలుడు ప్రతిభను మెచ్చుకున్న చిరంజీవి, తన అభిమానానికి మురిసిపోయాడు. సామ్ జామ్ తాజా ప్రోమోలు ఎపిసోడ్ పై ఆసక్తి రేపుతున్నాయి. ఇక ఆచార్య షూటింగ్ నిరవధికంగా సాగుతుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో దర్శకుడు కొరటాల శివ చిత్రీకరణ జరుపుతున్నారు. కాజల్ అగర్వాల్ ఆచార్య మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ చరణ్ నిర్మిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Sam Jam Mega Promo | Samantha Akkineni, Megastar Chiranjeevi | Ok Telugu

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version