ప్రపంచాన్ని కొత్త కరోనా వైరస్ భయపెడుతోంది. బ్రిటన్ లో రూపు మార్చుకున్న ఈ వైరస్ ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతోంది. చైనాలో పుట్టిన కరోనా బ్రిటన్ లో తాజాగా మరింత శక్తివంతమై లక్షల మందికి సోకి వందల మంది ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే బ్రిటన్ కు విమానాలను భారత్ సహా ప్రపంచదేశాలన్నీ రద్దు చేశాయి. అయితే ఇప్పటికే భారత్ కు ఈ కొత్త కరోనా వైరస్ వచ్చినట్టు తెలిసింది. దీంతో కేంద్రం కూడా హై అలెర్ట్ ప్రకటించింది.
Also Read: గూగుల్ కు లేఖ రాసిన తెలంగాణ పోలీసులు.. ఎందుకంటే?
బ్రిటన్ లో ప్రమాదకరంగా ఇప్పుడు కొత్త కరోనా వైరస్ విస్తరిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ కొత్త మహమ్మారి మనదేశం వరకూ పాకింది. భారత్ లోనూ ఇది అడుగుపెట్టడం కలకలం రేపుతోంది. బ్రిటన్ రాజధాని లండన్ నుంచి తాజాగా భారత్ కు వచ్చిన ఐదుగురు ప్రయాణికులు, విమాన సిబ్బందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారిని వెంటనే క్వారంటైన్ కు తరలించారు. వారి నమూనాలు సేకరించి.. నేషనల్ సెంటర్ వర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కి పంపించారు.
*బ్రిటన్ లో డేంజర్ కరోనా
బ్రిటన్ లో కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రపంచానికి ప్రమాదకారిగా మారుతోంది. కరోనా వైరస్ కంటే భయానక పరిస్థితులను సృష్టించే సామర్థ్యం దీనికి ఉన్నట్లుగా నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి చిన్న పిల్లలకు ఈ కొత్త వైరస్ సులువుగా సోకుతోందని తేలింది. ప్రస్తుతం బ్రిటన్ దక్షిణ ప్రాంతంలో ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని ముందు జాగ్రత్త చర్యలను తీసుకోకపోతే దేశం మొత్తాన్ని కమ్మేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
Also Read: మొదటిసారి మెట్టు దిగొచ్చిన మోడీ
తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన 266 మంది ప్రయాణికులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ వెంటనే వారికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. ఆ 266 మందిలో ఐదుమంది ప్రయాణికులు, విమాన సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లుగా తేలింది. వారిని క్వారంటైన్ కు తరలించారు.
దీన్ని బట్టి బ్రిటన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ స్ట్రెయిన్ భారత్ లోనూ వ్యాపించిందని అర్థమవుతోంది. ఈ వైరస్ దేశంలో విజృంభిస్తే లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముంబై లో దీన్ని అమలు చేస్తున్నారు.
ఇక విమానంలో ప్రయాణించిన 261 మందిని క్వారంటైన్ కు తరలించి బ్రిటన్ వైరస్ మన దేశంలో వ్యాప్తి చెందకుండా కేంద్రం చర్యలు చేపట్టింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్