వైకుంఠ ఏకాదశి రోజు ఉప్పు, చింతపండు వాడకూడదు!

మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు అన్ని విష్ణు ఆలయాలతోపాటు, కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరస్వామి దేవాలయం కూడా ముస్తాబయింది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25న రావడంతో పెద్ద ఎత్తున వైష్ణవాలయాలు ఈ వైకుంఠ ఏకాదశికి ముస్తాబయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం కోసం భక్తులు ఆరాటపడుతుంటారు. ఈ ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం […]

Written By: Navya, Updated On : డిసెంబర్ 26, 2020 3:13 సా.
Follow us on

మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు అన్ని విష్ణు ఆలయాలతోపాటు, కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరస్వామి దేవాలయం కూడా ముస్తాబయింది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25న రావడంతో పెద్ద ఎత్తున వైష్ణవాలయాలు ఈ వైకుంఠ ఏకాదశికి ముస్తాబయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం కోసం భక్తులు ఆరాటపడుతుంటారు. ఈ ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం వల్ల సకల సంపదలు చేకూరడమే కాకుండా, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు.

Also Read: 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

వైకుంఠ ఏకాదశి రోజు ప్రాతఃకాల సమయం నుంచి భక్తులకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసాలతో ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి.ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షలలో ఉండే వారు ఎటువంటి ఆహార పదార్థాలను సేవించకుండా కేవలం తులసి తీర్థం, పాలు మాత్రమే తీసుకొని ఏకాదశి రోజు రాత్రంతా నారాయణ మంత్రం జపిస్తూ జాగరణతో ఉండి, ద్వాదశి రోజున ఉపవాస దీక్ష విరమించాలి.

Also Read: రోజూ కాఫీ తాగుతున్నారా.. ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..?

ఉపవాస దీక్షలో ఉండే భక్తులు ద్వాదశిరోజు స్నానమాచరించి ఆ దేవుడికి నైవేద్యంగా బియ్యంతో వండిన ఆహారం ,గోధుమలను ఉపయోగించకుండా, నైవేద్యం చేయాలి. అలాగే ఆ నైవేద్యంలో ఉప్పు, చింతపండును వాడకూడదు. ఈ విధంగా స్వామివారికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో పూజించాలి. అలాగే గీతా పారాయణం, గోవింద నామ స్మరణంతో వైకుంఠ ఏకాదశి వ్రతం జరుపుకోవడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం