https://oktelugu.com/

వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయాల వద్ద భారీగా క్యూలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. వేకువ జామున 3.30 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. 3 వేల మంది ప్రముఖులు వైకుంఠ ద్వారా దర్శనానికి హాజరైనట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తర ద్వారా దర్శనానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 25, 2020 / 08:38 AM IST
    Follow us on

    ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయాల వద్ద భారీగా క్యూలు కట్టారు.

    ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. వేకువ జామున 3.30 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. 3 వేల మంది ప్రముఖులు వైకుంఠ ద్వారా దర్శనానికి హాజరైనట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తర ద్వారా దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు. నేటి నుంచి జనవరి 3 వరకు తిరుమలలో భక్తులకు ఈ ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇప్పటికే 10 రోజులకు గాను లక్ష టికెట్లను జారీ చేశారు.

    శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే, హైకోర్టు న్యాయమూర్తులు, ఏపీ నూతన సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

    ఏపీలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి వేడుకల్లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి పాల్గొన్నారు.

    ఇక తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఇవేకాకుండా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులు పోటెత్తారు.

    భద్రాద్రి శ్రీరాముల వారి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గరుడ వాహనంపై శ్రీరాముల వారిని దర్శనం ఇస్తున్నారు.