నిరుద్యోగులకు చిత్తూరులోని కలికిరి సైనిక్ స్కూల్ శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగాల భర్తీ కోసం కలికిరి సైనిక్ స్కూల్ అభ్యర్థుల నుంచి వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 10వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు ఫుల్ టైమ్ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. https://sskal.ac.in/ వెబ్ సైట్ ఉద్యోగ ఖాళీలు, ఉద్యోగ అర్హతలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
హెడ్ మాస్టర్, ప్రీ ప్రైమరీ టీచర్, హెడ్ క్లర్క్, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉండగా 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్లు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి 32 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఫుట్ టైమ్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సమాచారం.
https://bit.ly/3r87kk5 లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 12,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది