https://oktelugu.com/

ఎల్ఐసీ ఖాతాదారులకు అలర్ట్.. ఫామ్ నింపకపోతే డబ్బు పొందలేరట..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కీలక సూచన చేసింది. పాలసీ తీసుకున్న వాళ్లకు మెచ్యూరిటీ సమయం ముగిసినా ఎల్ఐసీ పాలసీపై రుణం తీసుకున్నా ఎన్.ఈ.ఎఫ్.టీఫామ్ ను నింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని నింపరీ వాళ్లు మెచ్యూరిటీ డబ్బును పొందలేరని సమాచారం. గతంలో ఎల్ఐసీ చెక్ ద్వారా మెచ్యూరిటీ డబ్బును చెల్లించేది. ప్రస్తుతం ఎల్ఐసీ పాలసీ తీసుకున్న వాళ్ల బ్యాంక్ ఖాతాలకు నగదును బదిలీ చేస్తోంది. పాలసీని తీసుకునే వాళ్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 22, 2021 / 08:29 PM IST
    Follow us on

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కీలక సూచన చేసింది. పాలసీ తీసుకున్న వాళ్లకు మెచ్యూరిటీ సమయం ముగిసినా ఎల్ఐసీ పాలసీపై రుణం తీసుకున్నా ఎన్.ఈ.ఎఫ్.టీఫామ్ ను నింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని నింపరీ వాళ్లు మెచ్యూరిటీ డబ్బును పొందలేరని సమాచారం. గతంలో ఎల్ఐసీ చెక్ ద్వారా మెచ్యూరిటీ డబ్బును చెల్లించేది.

    ప్రస్తుతం ఎల్ఐసీ పాలసీ తీసుకున్న వాళ్ల బ్యాంక్ ఖాతాలకు నగదును బదిలీ చేస్తోంది. పాలసీని తీసుకునే వాళ్లు పాలసీకి బ్యాంక్ ఖాతాను లింక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పాలసీకి బ్యాంక్ ఖాతాను లింక్ చేయరో వాళ్ల క్లెయిమ్ డబ్బులు అలానే ఉండిపోతాయి. పాలసీతో బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలంటే నెఫ్ట్ ఫారమ్ ను కచ్చితంగా నింపాలి. ఇలా చేయడం పాలసీ డబ్బులను ఎక్కడినుంచైనా సులభంగా పొందవచ్చు.

    ఎటువంటి అదనపు రుసుము లేకుండా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఎల్ఐసీ ఖాతాదారులు ఉచిత ఈ సేవల కొరకు కంపెనీ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. నెఫ్ట్ ఫారంతో పాటు ఖాతాదారులు బ్యాంక్ చెక్కు/ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీని తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఎల్ఐసీ నుంచి వచ్చిన డబ్బు ఏదైనా బ్యాంకు ఖాతాను చేరుతుంది.

    నెఫ్ట్ ఫారంను సబ్మిట్ చేసిన వారం రోజుల తర్వాత ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ ఖాతా లింక్ అవుతుంది. ఎల్ఐసీ పాలసీదారులకు పాలసీ మెచ్యూరిటీ ఉన్న పత్రాలను మార్చి 31 లోగా దేశవ్యాప్తంగా తమకు సమీపంలో ఉన్న ఎల్‌ఐసి కార్యాలయాలలో సమర్పించవచ్చని సూచించింది.