ప్రతీకారంతో ఇంగ్లండ్: తొలి వన్డేలో టీమిండియా కూర్పు ఇదే..

టెస్టుల్లో 3-1తో.. టీ20లో 3-2తో ప్రపంచ నంబర్ 1 జట్టు ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఇండియాకు ఇప్పుడు వన్డేల్లో కూడా ఆ ప్రవాహాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది.టెస్టులతో పోలిస్తే వరల్డ్ నంబర్ 1 టీ20 టీం ఇంగ్లండ్ టీ20లో ఓడిపోవడం ఎక్కువగా బాధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ టీం కనీసం వన్డేల్లో అయినా రాణించి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మంగళవారం తొలి వన్డే కావడంతో టీమిండియా కూడా అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది. టీ20 ప్రపంచకప్ […]

Written By: NARESH, Updated On : March 22, 2021 7:50 pm
Follow us on

టెస్టుల్లో 3-1తో.. టీ20లో 3-2తో ప్రపంచ నంబర్ 1 జట్టు ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఇండియాకు ఇప్పుడు వన్డేల్లో కూడా ఆ ప్రవాహాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది.టెస్టులతో పోలిస్తే వరల్డ్ నంబర్ 1 టీ20 టీం ఇంగ్లండ్ టీ20లో ఓడిపోవడం ఎక్కువగా బాధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ టీం కనీసం వన్డేల్లో అయినా రాణించి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

మంగళవారం తొలి వన్డే కావడంతో టీమిండియా కూడా అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది. టీ20 ప్రపంచకప్ నకు అదనపు సన్నద్ధతే లక్ష్యంగా ఇంగ్లండ్ తో మూడు వన్డేల్లో తలపడనుంది.

టీమిండియాలో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. టీ20లో అతడి ఫామ్ లేక పక్కన పెట్టిన ఇండియా..వన్డేల్లో మాత్రం ఆచితూచి ఆడే అవకాశం ఉండడంతో అతడికి అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రోహిత్ తో కలిసి శిఖర్ బ్యాటింగ్ ఆరంభించనున్నాడు. శిఖర్ కాకుండా శుభ్ మన్ గిల్, ఫృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ వంటి కుర్రాళ్లు రెడీగా ఉన్నారు.సిరీస్ లో రాణిస్తేనే శిఖర్ ఉంటాడు లేకపోతే రాబోయే సిరీస్ లకు కష్టమే.

రోహిత్ శర్మ భీకర ఫామ్ లో ఉండడం.. లయ తప్పిన కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం జట్టుకు కొండంత అండగా మారింది. మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్, పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. వీరికి సూర్యకుమార్జత కలిశాడు. కేఎల్ రాహుల్ కు ఈసారి కష్టమే అంటున్నారు. పంత్ నే కీపర్ గా కొనసాగించవచ్చు.

ఇక బౌలింగ్ ను సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నడిపిస్తాడు. అతడికి శార్ధుల్ ఠాకూర్, నటరాజన్, చాహల్, వాషింగ్టన్ సుందర్ జతకలవవచ్చు.

ఇంగ్లండ్ టీం మనకంటే దుర్భేద్యంగా ఉంది. కానీ కీలక సమయంలో స్పిన్, పేస్ కు ఔట్ అయ్యి మ్యాచ్ లు చేజార్చుకుంటోంది. ఆ టీంలో అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు.

మరి టెస్టులు, టీ20ల్లో దెబ్బతిన్న ఇంగ్లండ్ కనీసం వన్డేల్లో అయినా కోలుకొని సిరీస్ గెలుస్తుందా చూడాలి.