https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. భారీ యాక్షన్ సీన్ వైరల్..! 

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన బాణీలను సమకూరుస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నారు. ఇప్పటికే చరణ్.. ఎన్టీఆర్ టీజర్లు విడుదలై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 10:54 AM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన బాణీలను సమకూరుస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నారు. ఇప్పటికే చరణ్.. ఎన్టీఆర్ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

    Also Read: పాపం.. ‘భారతీయుడు 2’కి మరో సమస్య !

    కరోనా ఎఫెక్ట్ తో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆగిపోగా ఇటీవలే హైదరాబాద్లో తిరిగి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను రాజమౌళి అభిమానులతో పంచుకోగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అదిరిపోయే భారీ యాక్షన్ సీన్ ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    16సెకన్ల నిడివితో ఉన్న ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. వందలాది బ్రిటీష్ సైనికుల మద్య పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా తీసిన వీడియో ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి అంచనాలను పెంచేసింది. ఈ భారీ యాక్షన్ సీన్ థియేటర్లలో గుస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది.

    Also Read: ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో ఇదే బెస్ట్ చిత్రం

    ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడిగా ఓలివియా మోరిస్ నటిస్తుంది. ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగులో ఆలియా భట్.. ఓలివియా పాల్గొననున్నారు.