కేసీఆర్ తో చిరు.. నాగ్ భేటీ.. 2వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీకి గ్రీన్ సిగ్నల్?

కరోనా ఎఫెక్ట్ సినిమా రంగం కుదేలైపోయింది. థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోవడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇటీవలే ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగులకు.. థియేటర్లకు అనుమతి ఇచ్చాయి. అయితే ఇప్పట్లో ఈ రంగం కోలుకునేలా కన్పించడం లేదనే టాక్ విన్పిస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ టాలీవుడ్లో షూటింగుల పర్మిషన్ కోసం టాలీవుడ్ పెద్దలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలను కలిశారు. […]

Written By: NARESH, Updated On : November 8, 2020 11:39 am
Follow us on

కరోనా ఎఫెక్ట్ సినిమా రంగం కుదేలైపోయింది. థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోవడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇటీవలే ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగులకు.. థియేటర్లకు అనుమతి ఇచ్చాయి. అయితే ఇప్పట్లో ఈ రంగం కోలుకునేలా కన్పించడం లేదనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

టాలీవుడ్లో షూటింగుల పర్మిషన్ కోసం టాలీవుడ్ పెద్దలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలను కలిశారు. అప్పట్లోనే సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చ జరిగినట్లు తెల్సింది. తాజాగా సీఎం కేసీఆర్ ను మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున ప్రగతిభవన్లో కలుసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా  మారింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై అభివృద్ధిపై వారంతా చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read: ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో ఇదే బెస్ట్ చిత్రం

తెలంగాణలో దాదాపు 10లక్షల మంది చిత్ర పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. వీరిని ఆదుకునేలా.. థియేటర్లు పునః ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటిలోనే హైదరాబాద్ శివారులో దాదాపు 2వేల ఎకరాల్లో భారీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి కేసీఆర్ తో చిరు.. నాగ్ చర్చించినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.గతంలోనే సీఎం కేసీఆర్ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అయితే నేటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా కేసీఆర్ తో చిరంజీవి.. నాగార్జున భేటి కావడంతో మరోసారి భారీ ఫిల్మ్ సిటీ తెరపైకి వచ్చింది. ఈమేరకు ప్రభుత్వం 1500 నుంచి 2వేల ఎకరాల స్థలాన్ని సేకరిస్తుందని తెలుస్తోంది.

Also Read: పాపం.. ‘భారతీయుడు 2’కి మరో సమస్య !

 ప్రస్తుత సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్ అవసరాల తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ తో చిరు.. నాగ్ బేటికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈసారైనా ఫిల్మ్ సిటీ నిర్మాణం పట్టాలెక్కుతుందా? లేక ప్రతిపాదనలకే పరిమితం అవుతుందో వేచిచూడాల్సిందే..!