ఆర్ఆర్ఆర్: 300 కోట్ల ఆఫర్ కాదన్నారు.. అంతకుమించి..

దిగ్గజ దర్శకుడు జక్కన్న చెక్కుతున్న శిల్పం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రాజమౌళి చరిష్మాతో సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోంది. ఊహకందని రీతిలో డిమాండ్ అందుకుంది. ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి మరోసారి రికార్డులు బ్రేక్ చేసేందుకు గట్టి ప్లాన్ తో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా ఈ మూవీ ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, […]

Written By: NARESH, Updated On : March 27, 2021 10:23 am
Follow us on

దిగ్గజ దర్శకుడు జక్కన్న చెక్కుతున్న శిల్పం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రాజమౌళి చరిష్మాతో సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోంది. ఊహకందని రీతిలో డిమాండ్ అందుకుంది.

ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి మరోసారి రికార్డులు బ్రేక్ చేసేందుకు గట్టి ప్లాన్ తో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా ఈ మూవీ ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఐదు భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కుల రూపంలో 350 కోట్ల డీల్ పూర్తి చేశారని.. మరో 6 భాషల రిలీజ్ హక్కులకు అదనపు మొత్తం ముట్టిందని సమాచారం. తొలి బిగ్ డీల్ తోనే బడ్జెట్ అంతా రికవరీ అయ్యిందని సమాచారం. ఇక ఆడియో, శాటిలైట్, డిజిటల్ అదనంగా లాభం తేనున్నాయి.

తాజాగా సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ డిజిటల్ , శాటిలైట్ డీల్ కూడా మాట్లాడుతున్నారని.. చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే స్టార్ మా శాటిలైట్ రూ .130 కోట్లు… -అమెజాన్ ప్రైమ్ వాళ్లు డిజిటల్ రూ .160కోట్లు కలుపుకుని మొత్తం రూ .291 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. పోటీ బరిలో నెట్ ఫ్లిక్స్ .. జెమిని లాంటి బడా కార్పొరెట్ సంస్థలు భారీగా ఆఫర్ చేస్తాయని వెయిట్ చేస్తున్నారట.

భారీ డిమాండ్ ఉండడంతో డీల్ క్లోజ్ చేయకుండా ఆర్ఆర్ఆర్ టీం వెయిట్ చేస్తున్నారట.. హైప్ ను బట్టి మరింత డిమాండ్ పెరిగి లాభాల పంట పండుతుందని తెలుస్తోంది.