https://oktelugu.com/

ఆడవేషాలు వేసి సంపాదించిన స్టార్ !

అక్కినేని నాగేశ్వరరావుగారిది 75 ఏళ్ల సినీ ప్రయాణం. తెలుగు సినీ కళామతల్లి అప్పుడే పుట్టి, ఎదుగుతున్న కాలం అది, తొలితరం సూపర్ స్టార్స్ లో మొదటి సూపర్ స్టార్ కూడా అక్కినేనినే. నిజానికి మూకీ చిత్రాలప్పుడే ఏఎన్నార్ సినీప్రయాణం మొదలైనా, ఆయన జీవితంలోని ప్రతి మలుపును ఆయన ఎంతో ఆస్వాదించారు. అయితే ఆక్కినేని ఎంత ఎదిగినా.. ఆయనెప్పుడు ఒదిగే ఉన్నారు. ఆయన గురించి ఆయనే రాసుకున్న మాటలు.. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. చదువుకోలేదు. సంస్కారం తెలీదు.మాట్లాడ్డం […]

Written By: , Updated On : March 26, 2021 / 05:03 PM IST
Follow us on

ANR
అక్కినేని నాగేశ్వరరావుగారిది 75 ఏళ్ల సినీ ప్రయాణం. తెలుగు సినీ కళామతల్లి అప్పుడే పుట్టి, ఎదుగుతున్న కాలం అది, తొలితరం సూపర్ స్టార్స్ లో మొదటి సూపర్ స్టార్ కూడా అక్కినేనినే. నిజానికి మూకీ చిత్రాలప్పుడే ఏఎన్నార్ సినీప్రయాణం మొదలైనా, ఆయన జీవితంలోని ప్రతి మలుపును ఆయన ఎంతో ఆస్వాదించారు. అయితే ఆక్కినేని ఎంత ఎదిగినా.. ఆయనెప్పుడు ఒదిగే ఉన్నారు. ఆయన గురించి ఆయనే రాసుకున్న మాటలు.. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. చదువుకోలేదు. సంస్కారం తెలీదు.మాట్లాడ్డం తెలీదు. పెద్దలు కనిపిస్తే నమస్కారం పెట్టాలని కూడా తెలియని వాడిని. అలాంటి నన్ను ఈ సినిమా ప్రపంచం ఒక మనిషిని చేసింది.

Also Read: ఆర్ఆర్ఆర్: 300 కోట్ల ఆఫర్ కాదన్నారు.. అంతకుమించి..

ఓ గొప్ప వ్యక్తి ఇలా మాట్లాడాలంటే ఎంత గొప్పతనం కావాలి. పైగా మనకు తెలియని ‘అక్కినేని’ని తెలుసుకుంటే నాగేశ్వరరావుగారి గొప్పతనం ఇంకా అర్ధం అవుతుంది. ముఖ్యంగా బాల్యంలో నాగేశ్వరరావు ఎన్నో కష్టాలు పడ్డారు, అవమానాలు అనుభవించారు. దిగువ మధ్యతరగతికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన తన ఇబ్బందులను ఎప్పుడు ఇబ్బందులుగా భావించేవారు కారట. వాటి నుండి ఎలా బయట పడాలా అని, ఆయన ఎప్పుడూ వాటి గురించే ఆలోచించేవారట. ఆ క్రమంలోనే అక్కినేని గొడ్లచావిడిలో పాడిపశువుల పేడతీసి, పాలుపితికి సంపాందించిన సంగతులూ ఉన్నాయి.

Also Read: ఆర్ఆర్ఆర్ రాంచరణ్ ఫస్ట్ లుక్: వీరోచిత ‘రామా

ఇక గుడివాడ దగ్గరలోని తన స్వంత గ్రామం వెంకట రామాపురంలో ఉన్నప్పుడు అక్కినేని ఎక్కువుగా ‘హరిశ్చంద్ర’ నాటకంలో నారదుడి వేషం వేసేవారు. అయితే స్కూలు వార్షికోత్సవంలో ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో ‘చంద్రమతి’గా ఆడవేషం వేశారు. అది సూపర్‌ హిట్టయ్యింది. దాంతో ఆయనకు బాలనటుడిగా అనేక నాటకాల్లో ఆడవేషాలు వచ్చేవి. దాంతో ఆయన ఆడవేషాలు వేసే సంపాధించడటం మొదలుపెట్టారట. ఇక సీతారామ జననంలో రాముడి వేషంతో హీరోగా మొదలైన అక్కినేని నటనా జీవితం.. దశాబ్దాలవారీగా ఎలా సాగిందో అందరికి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్