నిజాం కట్టించిన పురాతన తెలంగాణ అసెంబ్లీ భవనం కూలింది. అసెంబ్లీ పరిసరాల్లో పెద్దగా ప్రజాప్రతినిధులు, సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Also Read: బీజేపీ–జనసేనల మధ్య తెగని సీటు పంచాయితీ
పాత అసెంబ్లీ భవనం తూర్పు వైపు ఎలివేషన్ ఒక్కసారిగా పెద్ద శబ్ధం చేస్తూ కూలింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయం భవనం పైకప్పు గోపురం కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది అక్కడకు పరుగులు తీశారు. శిథిలాలు గార్డెన్ ఏరియాలోనూ పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోనే కొత్త సెక్రటేరియట్ , ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. గత ఏడాది భూమి పూజ చేశారు.
Also Read: కడపలో జగన్‌కు షాక్ : టీడీపీ మద్దతుదారుల విజయం
ఈ కూలిన తెలంగాణ అసెంబ్లీ భవనానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ దీన్ని నిర్మించాడు. ప్రజలు ఇచ్చిన చందాలతోనే ఈ భవనాన్ని కట్టారు. 1905లో పనులు ప్రారంభం కాగా.. 1913 డిసెంబర్ లో పూర్తయ్యాయి. ఏడో నిజాం దీన్ని ప్రారంభించాడు. దీన్ని మొదట్లో ‘మహబూబియా టౌన్ హాల్’ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాక తర్వాత అసెంబ్లీగా మార్చారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్