https://oktelugu.com/

ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా రూ.10 వేలు పొందే ఛాన్స్..?

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బై నౌ పే లేటర్ ఆఫర్ సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ పే లేటర్ పేరుతో ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఈ సర్వీసులను వినియోగించుకోవాలంటే క్రెడిట్ లిమిట్‌ ద్వారా ఏదైనా ప్రొడక్టును కొని డబ్బులను తర్వాత చెల్లించవచ్చు. Also Read: చౌక వడ్డీకే రుణాలు అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 23, 2021 / 03:00 PM IST
    Follow us on

    దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బై నౌ పే లేటర్ ఆఫర్ సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ పే లేటర్ పేరుతో ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఈ సర్వీసులను వినియోగించుకోవాలంటే క్రెడిట్ లిమిట్‌ ద్వారా ఏదైనా ప్రొడక్టును కొని డబ్బులను తర్వాత చెల్లించవచ్చు.

    Also Read: చౌక వడ్డీకే రుణాలు అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!

    ఎవరైనా ఐసీఐసీఐ బ్యాంక్ పే లేటర్ ఆప్షన్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఆ డబ్బులను తర్వాతి నెల 15వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల వరకు వడ్డీని చెల్లించకుండా ఉండే అవకాశం కలుగుతుంది. అయితే కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులవుతారు. ఐసీఐసీఐ బ్యాంక్ కు సంబంధించిన ఐమొబైల్ యాప్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: వాహనదారులకు అలర్ట్.. వారికి వాహనం ఇస్తే జైలుకే..?

    ఈ సర్వీసులను పొందాలని భావించే కస్టమర్లు ఐసీఐసీఐ పాకెట్స్ యాప్, బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న సర్వీసులను అంగీకరిస్తారో వారికి పే లేటర్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఆ తరువాత ఈ సర్వీసుల సహాయంతో అమెజాన్, పేటీఎం, మొబిక్విక్, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు చేయడంతో పాటు గ్రాసరీలను కొనుగోలు చేయవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఐసీఐసీఐ పే లేటర్ సర్వీసుల ద్వారా షాపింగ్ మాత్రమే చేయడం సాధ్యమవుతుంది. ఇతరుల బ్యాంక్ ఖాతాలకు మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులను పంపించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. కొనుగోళ్లకు మాత్రమే ఈ బెనిఫిట్ పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో కొందరికి ఈ మాత్రమే ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. బ్యాంక్ ఎంత లిమిట్ వస్తుందనే అంశాన్ని నిర్ణయించడం జరుగుతుంది.