అప్పుల భారం పెరుగుతోందా.. తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనల వల్ల కోట్ల సంఖ్యలో ప్రజలకు రుణ భారం పెరిగింది. అప్పు తీసుకోవడం కంటే తిరిగి చెల్లించడంలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒక అప్పును చెల్లించడానికి మరో అప్పుపై ఆధారపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అప్పుల భారాన్ని తక్కువ సమయంలో తగ్గించుకోవడంతో పాటు ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. చాలామంది లగ్జరీగా బ్రతకాలనే ఆలోచనతో ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా మనం సంపాదించిన […]

Written By: Navya, Updated On : December 27, 2020 11:40 am
Follow us on


దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనల వల్ల కోట్ల సంఖ్యలో ప్రజలకు రుణ భారం పెరిగింది. అప్పు తీసుకోవడం కంటే తిరిగి చెల్లించడంలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒక అప్పును చెల్లించడానికి మరో అప్పుపై ఆధారపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అప్పుల భారాన్ని తక్కువ సమయంలో తగ్గించుకోవడంతో పాటు ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది.

చాలామంది లగ్జరీగా బ్రతకాలనే ఆలోచనతో ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా మనం సంపాదించిన ఆదాయంతో ఖర్చు చేయాలే తప్పు అప్పు చేసి అవసరం లేని వస్తువుల కోసం ఖర్చు చేస్తే ఇబ్బందులు పడక తప్పదు. అవసరం లేని అప్పుల వల్ల వడ్డీల భారం పెరగడంతో పాటు ప్రశాంతత దూరమవుతుంది. రుణాల నుంచి బయటపడటానికి తక్కువ సమయంలో న్యాయంగా లాభాలు ఇచ్చేవాటిపై పెట్టుబడులు పెట్టాలి.

ఆ పెట్టుబడి నుంచి వచ్చే లాభాలలో కొంత మొత్తం రుణం చెల్లించి మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తే మంచిది. ఎక్కువ మొత్తం రుణాలను వీలైతే ఒకేసారి లేదంటే విడతల వారీగా చెల్లిస్తూ రుణ భారం తగ్గించుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. అప్పులకు చెల్లించే వడ్డీని బట్టి ఎక్కువ వడ్డీ ఉన్న రుణాన్ని త్వరగా చెల్లిస్తే మంచిది. మనం తీసుకున్న రుణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెనాల్టీలు పడకుండా జాగ్రత్త పడాలి.

క్రెడిట్ కార్డుల ద్వారా రుణం తీసుకుంటే ఆ రుణాల చెల్లింపులో ఆలస్యం చేయకూడదు. ఏ ఖర్చుల వల్ల రుణాలు పెరుగుతున్నాయో అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ ఖర్చులలో వేటికి అనవసరంగా ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నామో తెలుసుకుని కొత్త ఖర్చులను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. అవసరాలకు మాత్రమే వచ్చే డబ్బులను కేటాయించి ప్రాధాన్యతలను తెలుసుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు.