https://oktelugu.com/

బోర్డు తెస్తానన్న బోడి గుండు ఎక్కడ.. ఎంపీ అరవింద్ ను కడిగేసిన రేవంత్

గత సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి మరీ నిజామాబాద్ ఎంపీగా గెలిచాడు బీజేపీ నేత అరవింద్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గెలిపిస్తే తాను పసుపుబోర్డు, పసుపుపంటకు మద్దతు ధర ఇప్పిస్తానని పసుపు రైతులకు హామీనిచ్చి గెలిచాడు. అయితే గెలిచి రెండేళ్లేనా అదీ అతీ గతీ లేదు. ఎంపీగా గెలిచిన రెండు రోజుల్లోనే నిజామాబాద్ రైతుల కోసం పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఎక్కడ […]

Written By: , Updated On : January 30, 2021 / 08:38 PM IST
Follow us on

గత సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి మరీ నిజామాబాద్ ఎంపీగా గెలిచాడు బీజేపీ నేత అరవింద్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గెలిపిస్తే తాను పసుపుబోర్డు, పసుపుపంటకు మద్దతు ధర ఇప్పిస్తానని పసుపు రైతులకు హామీనిచ్చి గెలిచాడు. అయితే గెలిచి రెండేళ్లేనా అదీ అతీ గతీ లేదు.

ఎంపీగా గెలిచిన రెండు రోజుల్లోనే నిజామాబాద్ రైతుల కోసం పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఎక్కడ ఉన్నారని ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. పసుపుబోర్డు, పంటకు మద్దతు ధర కోసం ఆర్మూర్ లో రైతులు నిర్వహించిన రైతు భరోసా ధీక్షలో రేవంత్ పాల్గొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు భారీగా ఈ సభలో పాల్గొన్నారు.

పసుపు బోర్డు తెస్తానన్న బోడ గుండోడు ఎక్కడ అని అర్వింద్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగాడు. మోడీ సహా బీజేపీ నేతలంతా రైతు వ్యతిరేకులు అని.. నల్ల చట్టాలని తెచ్చి రైతుల గొంతు కోస్తున్నారని విమర్శించారు. పసుపుబోర్డు , ధర రాకపోతే ఆ తేడాను తాము చెల్లించేలా చూస్తానని రామ్ మాధవ్ కూడా అరవింద్ తో హామీ ఇచ్చాడని.. ఇప్పుడు వారంతా కనిపించకుండా పోయారని మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం చేసిన అరవింద్ ఇప్పుడు రైతుల మధ్యకు వచ్చి పోరాటం చేయడం లేదు అంటూ మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ సైతం మోడీ ఒడిలో కూర్చొని రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు, పంటకు మద్దతు ధరపై ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలని.. కాంగ్రెస్ కలిసివస్తుందని పిలుపునిచ్చాడు.

రైతులకు అన్యాయం చేసిన అరవింద్ రాజకీయ భవిష్యత్తును రైతులే బొంద పెడుతారని.. రైతుల గోస కనిపించడం లేదా అని రేవంత్ నిలదీశారు. రైతులు సిద్దం కండని.. ఢిల్లీకి వెళ్లి కదం తొక్కుదామని.. ఢిల్లీ వెళ్లేందుకు రైలు టికెట్లు నేను ఇస్తానని.. అవసరమైతే మన బండ్లు మనమే మాట్లాడుకొని పోదామని రేవంత్ హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీతో మాట్లాడి పార్లమెంట్ లో కొట్లాడుతామని.. డేట్ మీరు నిర్ణయించండని.. ఢిల్లీ పోయేందుకు నేను ఏర్పాట్లు చేస్తానని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.