రేవంత్ యాక్షన్ ప్లాన్ ముందుగానే రెడీ అయిందా?

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి తన పదవీ రాజీనామా చేశాడు. దీంతో కొత్త టీపీసీసీ చీఫ్ ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవీ కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవీని రేవంత్ రెడ్డి కట్టబెడుతుందనే ప్రచారం జరగడంతో ఆపార్టీలోని సీనియర్లు అలర్టయ్యారు. ఎవరికీ వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ మొదలు పెట్టారు. దీంతో ఎవరికీ టీపీసీసీ పదవీ దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది. టీపీసీసీ […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 9:31 pm
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి తన పదవీ రాజీనామా చేశాడు. దీంతో కొత్త టీపీసీసీ చీఫ్ ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవీ కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది.

కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవీని రేవంత్ రెడ్డి కట్టబెడుతుందనే ప్రచారం జరగడంతో ఆపార్టీలోని సీనియర్లు అలర్టయ్యారు. ఎవరికీ వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ మొదలు పెట్టారు. దీంతో ఎవరికీ టీపీసీసీ పదవీ దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది.

టీపీసీసీ రేసులో ప్రధానంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీధర్ బాబు పేర్లు విన్పిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరి టీపీసీసీ పదవీ దక్కే అవకాశం ఉందనే కాంగ్రెస్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.

ఈ రేసులో అందరికీ కంటే ముందు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మిగతావారికి సవాల్ విసురుతున్నట్లుగా ఉన్నాయి. తనకు టీపీసీసీ పదవీ దక్కితే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు.

తెలంగాణ సమాజానికి సేవా చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రతీ గుండె చప్పుడు తెలుసుకునేందుకే తాను పాదయాత్ర చేయబోతున్నట్లు రేవంత్ పేర్కొన్నాడు.

దీంతో రేవంత్ రెడ్డి టీపీసీసీ దక్కక ముందే తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు అర్థమవుతోంది. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోని సీనియర్లు ఎలా రియాక్టవుతారో వేచిచూడాల్సిందే..!