https://oktelugu.com/

రవితేజ ఈసారి ఇలా నవ్విస్తాడంట!

రవితేజ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ‘క్రాక్’ మూవీతో హిట్ కొట్టిన రవితేజ తాజాగా యువ దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిన్న అధికారికంగా ఈ సినిమా ప్రకటించారు. Also Read: సునీతకు ఆఫర్లు మామూలుగా లేవుగా.. క్రాక్ లో పోలీస్ గా ఇరక్కొటేసిన రవితేజ.. ఇప్పుడు త్రినాథరావు సినిమాలో ‘కామెడీ లాయర్’ గా నవ్వులు పంచుతాడని బయటకు లీకైంది. రవితేజ అంటేనే ఫుల్ ఆఫ్ ఎనర్జీ కిక్ సినిమా రాజాది గ్రేట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2021 / 10:39 AM IST
    Follow us on

    రవితేజ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ‘క్రాక్’ మూవీతో హిట్ కొట్టిన రవితేజ తాజాగా యువ దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిన్న అధికారికంగా ఈ సినిమా ప్రకటించారు.

    Also Read: సునీతకు ఆఫర్లు మామూలుగా లేవుగా..

    క్రాక్ లో పోలీస్ గా ఇరక్కొటేసిన రవితేజ.. ఇప్పుడు త్రినాథరావు సినిమాలో ‘కామెడీ లాయర్’ గా నవ్వులు పంచుతాడని బయటకు లీకైంది. రవితేజ అంటేనే ఫుల్ ఆఫ్ ఎనర్జీ కిక్ సినిమా రాజాది గ్రేట్ లో అంధుడిగా.. నుంచి క్రాక్ లో పోలీస్ గా రవితేజ ఎనర్జీకి థియేటర్స్ లో విజిల్స్ పడుతుంటాయి.

    అలాంటి ఎనర్జీ స్టోరీనే త్రినాథరావు తయారు చేసినట్టు సమాచారం. రవితేజ మార్క్ అల్లరి ఈ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తుందని టాక్ బయటకు వచ్చింది. హీరోయిన్ కూడా లాయర్ యేనంట.. సో వీరి కామెడీకి ఇక హద్దులు లేవనుకుంటా..

    Also Read: సిటీమార్ ట్రైలర్ టాక్: గోపీచంద్ కబడ్డీ ఆడేశాడు..

    ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ మూవీ చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే ‘త్రినాథరావు’ మూవీ పట్టాలెక్కలనుంది.