https://oktelugu.com/

సిటీమార్ ట్రైలర్ టాక్: గోపీచంద్ కబడ్డీ ఆడేశాడు..

విలన్ నుంచి హీరోగా మారిన గోపీచంద్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీలకు పెట్టింది పేరు. వరుసగా అలాంటి సినిమాలతోనే వస్తున్న ఈ హీరో తాజాగా ‘సిటీమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. Also Read: సునీతకు ఆఫర్లు మామూలుగా లేవుగా.. సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిదీ.. కరోనాకు ముందే సిటీమార్ షూటింగ్ కంప్లీట్ అయినా థియేటర్లు, నిషేధంతో ముందుకు రాలేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2021 / 10:55 AM IST
    Follow us on

    విలన్ నుంచి హీరోగా మారిన గోపీచంద్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీలకు పెట్టింది పేరు. వరుసగా అలాంటి సినిమాలతోనే వస్తున్న ఈ హీరో తాజాగా ‘సిటీమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

    Also Read: సునీతకు ఆఫర్లు మామూలుగా లేవుగా..

    సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిదీ.. కరోనాకు ముందే సిటీమార్ షూటింగ్ కంప్లీట్ అయినా థియేటర్లు, నిషేధంతో ముందుకు రాలేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది.

    తాజాగా ‘సిటీమార్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా విడుదల తేదీగా ‘ఏప్రిల్ 2’ ప్రకటించారు. ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తున్నారు. అయితే అంతకుమించిన ఫుల్ మాస్ యాక్షన్ సీన్లు ున్నాయి. పక్కా కమర్షియల్ మూవీగా ఇది తెరకెక్కినట్టు తెలుస్తోంది.

    Also Read: సిటీమార్ ట్రైలర్ టాక్: గోపీచంద్ కబడ్డీ ఆడేశాడు..

    సినిమాలో హీరోయిజం, విలనిజాన్ని బాగా ఎలివేట్ చేశారు. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్