ఏపీలో కుల రాజకీయాలు కామన్. అది ఇప్పుడు కాదు అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీలనే ఆయన నమ్ముకున్నట్లుగా అర్థమవుతోంది. బీసీలే భవిష్యత్ ఇస్తారనే భరోసా ఆయనలో కనిపిస్తోంది. అందుకే.. ఆయన పెద్దగా కాపు సామాజికవర్గాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఆ సామాజిక వర్గం ఓట్లపై పెద్దగా దృష్టి పెట్టడంలేదని టాక్.
Also Read: కేంద్రం ‘స్వదేశీ’ సోషల్ ఫైట్..
తండ్రి వైఎస్ రాజేశఖర్ రెడ్డి లాగే.. జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు కులాలు, మతాలు, ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ అందుతున్నాయి. ఇందులో కాపు సామాజికవర్గం కూడా ఉంది. కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ సామాజికవర్గంలో అర్హులైన వారికి పథకాలను అందజేస్తున్నారు. అయితే.. ఇటీవల కాలంలో బీజేపీ, జనసేన కలవడంతో కాపుల ఓటు బ్యాంకు వైసీపీ నుంచి పక్కకు మరలే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది.
జనసేన జత కలవడంతో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఆ కూటమి వైపు మొగ్గు చూపుతోంది. అందుకే.. ఇప్పుడు ఎక్కువగా బీసీలపై ఫోకస్ చేయాలని వైసీపీ అధినేత జగన్ ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఎక్కువ శాతం వైసీపీ వైపు చూశారు. వీరితోపాటు అధిక సంఖ్యలో ఉన్న బీసీలు సయితం జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. బీసీలు సహజంగా టీడీపీకి అనుకూలంగా ఉండేవారు. అయితే.. గత ఎన్నికల్లో మాత్రం వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అందుకే జగన్‌కు అంతటి భారీ విజయం లభించింది.
Also Read: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం.. ఎవరికెన్ని సీట్లంటే?
అందుకే.. ఈసారి కూడా బీసీలను వదులుకోకూడదన్న ధోరణిలోనే జగన్ ఉన్నారు. బీజేపీ, జనసేనలు కలిసి కాపు సామాజికవర్గంపైనే ఫోకస్ పెట్టడం తమకు సానుకూలత అని జగన్ భావిస్తున్నారు. దానివల్ల బీసీలు మరింత బలంగా వైసీపీ వైపు చూస్తారంటున్నారు. ఈ పరిణామాలతో దెబ్బతినేది టీడీపీయేనన్న అంచనాలో ఉన్నారు. అందుకే జగన్ పెద్దగా కాపులపై ఫోకస్ పెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చారట.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్