https://oktelugu.com/

Ration Card: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్!

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లకు మాత్రమే కొన్ని పథకాలను అమలు చేస్తున్నాయి. జాతీయ ఆహార భద్రతా పథకం కింద రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు సబ్సిడీ ధరలకే ఆహార ధాన్యాలను పొందే అవకాశం ఉంది. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. అయితే దేశంలో అర్హత ఉన్నప్పటికీ చాలామందికి ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు గతంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 29, 2021 / 07:21 PM IST
    Follow us on

    కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లకు మాత్రమే కొన్ని పథకాలను అమలు చేస్తున్నాయి. జాతీయ ఆహార భద్రతా పథకం కింద రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు సబ్సిడీ ధరలకే ఆహార ధాన్యాలను పొందే అవకాశం ఉంది. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. అయితే దేశంలో అర్హత ఉన్నప్పటికీ చాలామందికి ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు.

    కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు గతంతో పోలిస్తే నిబంధనలు కఠినం అయ్యాయి. అందువల్ల కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పది రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త సాఫ్ట్ వేర్ అమలులోకి రావడంతో నిబంధనలలో మార్పులు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇకపై కొత్త రేషన్ కార్డ్ కావాలంటే కుటుంబ పెద్ద పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, గతంలో రేషన్ కార్డు రద్దై ఉంటే ఆ సర్టిఫికెట్, గ్యాస్ పాస్ బుక్ ఫోటో కాపీ, కుటుంబ పెద్ద బ్యాంక్ ఖాతా జిరాక్స్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్ లను సమర్పించాలి.

    వీటితో పాటు జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, జాబ్ కార్డ్ హోల్డర్ అయిన వాళ్లు జాబ్ కార్డ్ కాపీ, ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించిన ఫోటో కాపీ, ఇంటిపన్ను లేదా కరెంట్ బిల్ జిరాక్స్, దివ్యాంగ వినియోగదారులు వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ధృవపత్రాలు సబ్మిట్ చేసే విషయంలో ఫెయిల్ అయితే రేషన్ కార్డు మంజూరు కాదు.

    గతంలో కేవలం కుటుంబ పెద్ద ఫోటో, ఆదాయానికి సంబంధించిన ధృవపత్రం, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు ఉంటే రేషన్ మంజూరయ్యేది. రేషన్ కార్డు లేనివాళ్లు సమీపంలోని రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లేదా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ను సంప్రదించి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.