కొన్ని కొన్ని ప్రాజెక్టులు కొందరితోనే సాధ్యం. అలాంటి ఇలాంటి కాంబినేషన్లు కావవి..కలలో కూడా ఊహించని కలయికలు.. అలాంటిదే టాలీవుడ్ లో ఒకటి చోటుచేసుకుంది.
దక్షిణాది దిగ్గజ దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో తీయబోతున్నాడు. ఇది తీసేదా దిల్ రాజు కావడం విశేషం. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ తో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజ్ కలిస్తే ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం. ఇప్పుడు అదే జరగబోతోంది.
శంకర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది స్టార్ హీరోలు తపనపడుతుంటారు. శంకర్ తీసిన తొలి సినిమా ‘జెంటిల్ మెన్’ మూవీని కూడా మొదట చిరంజీవితోనే తీయాలనుకున్నారట.. కానీ అప్పుడు చిరు ఫుల్ స్వింగ్ లో ఉండడంతో సాధ్యం కాలేదు. అయితే ఇదే చిరంజీవి ఇదే కథను హిందీలో తీశాడు.
తాజాగా చిరంజీవికి తీరని కోరిక రాంచరణ్ కు తీరబోతోంది. రాంచరణ్ హీరోగా శంకర్ తన తదుపరి చిత్రాన్ని తీస్తున్నాడు. శంకర్ కు, రాంచరణ్ కు ఇది 15వ సినిమా కావడం విశేషం. దిల్ రాజ్ బ్యానర్ లో వస్తున్న 50వ సినిమా ఇదీ. పైగా శంకర్ తొలిసారి నేరుగా తెలుగులో అదీ ఓ తెలుగు హీరోతో సినిమా చేస్తుండడం విశేషంగా మారింది.
ఈ సినిమా కథ గూస్ బాంబ్స్ తెప్పిస్తుందని.. ఇప్పటివరకు రాంచరణ్ చేయని సరికొత్త పాత్రను శంకర్ తీర్చిదిద్దాడని టాక్. దీన్ని పాన్ ఇండియా లెవల్లో తీస్తుండడంతో భారీ హైప్ వచ్చేసింది.
Excited to be a part of Shankar Sir's cinematic brilliance produced by Raju garu and Shirish garu.
Looking forward to #RC15 ! @shankarshanmugh @SVC_official #SVC50 pic.twitter.com/SpjOkqyAD4
— Ram Charan (@AlwaysRamCharan) February 12, 2021