https://oktelugu.com/

‘ఉప్పెన’ డిజిటల్ రిలీజ్ కూడా ఫిక్స్ !

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో మొత్తానికి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరో కొత్త హీరో హీరోయిన్లు దొరికినట్టే. ఒక చిన్న సినిమాకి, పెద్ద స్టార్ డమ్ రావడం, బహుశా ఈ సినిమాతోనే సాధ్యం అయిందనుకుంటా. ఏది ఏమైనా ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. జనాల దృష్టిలో ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఈ హిట్ ఈ సినిమా కథదే. ఎంత మెగాస్టార్ చిన్న మేనల్లుడు […]

Written By:
  • admin
  • , Updated On : February 13, 2021 / 05:50 PM IST
    Follow us on


    మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో మొత్తానికి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరో కొత్త హీరో హీరోయిన్లు దొరికినట్టే. ఒక చిన్న సినిమాకి, పెద్ద స్టార్ డమ్ రావడం, బహుశా ఈ సినిమాతోనే సాధ్యం అయిందనుకుంటా. ఏది ఏమైనా ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. జనాల దృష్టిలో ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఈ హిట్ ఈ సినిమా కథదే. ఎంత మెగాస్టార్ చిన్న మేనల్లుడు అయినా, వైష్ణవ్ తేజ్ సినిమా ఊరికినే ఆడట్లేదు. సినిమాలో బలమైన కంటెంట్ ఉండటం వల్లే ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీ అనిపించుకుంది.

    Also Read: శంకర్-రాంచరణ్ సినిమా అనౌన్స్.. దిల్ రాజ్ నిర్మాత.. కథ వింటే గూస్ బాంబ్స్ ఖాయం

    కాగా తాజాగా ఈ సినిమా డిజిటల్ ఎంట్రీకి కూడా డేట్ ఫిక్స్ అయింది. ఈ మధ్య ఓటీటీల్లో కొత్త సినిమాలు థియేటర్లల్లో ఉండగానే విడుదలైపోతున్నాయి. కాగా ఉప్పెన చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 11న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా థియేటర్స్ లో అదరగొడుతుంది. భారీగా పెరిగిపోయిన అంచనాలను ఉప్పెన అందుకోవడం కష్టం అనుకున్నారు. కానీ సినిమా అద్భుతంగా ఉండటంతో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.

    చాల కాలం తరువాత హౌస్ ఫుల్ బోర్డ్స్ ఉప్పెనకు మాత్రమే బుక్ అవుతున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు. పైగా ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని నటించడానికి ఒప్పించడం, విజయ్ సేతుపతి తన పాత్రలో ఎక్కువ నిడివి లేకపోయినా, తన ఆహార్యంతోనే ఆ పాత్రకు బలం పెంచడంతో ఈ సినిమా మెయిన్ పాయింట్ కి బాగా ప్లస్ అయింది.

    Also Read: ప్రేమ‌పెళ్లి చేసుకున్న సినీతార‌లు.. మీ స్టార్లు ఉన్నారేమో చూడండి!

    అన్నట్లు ఈ సినిమా పై మిగిలిన భాషల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయినా తన కూతుర్ని ప్రేమలోకి దించాడని ఏకంగా ఆ కుర్రాడి మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేసే పాయింట్ తో.. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించడం అంటే గొప్ప విషయమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్