ప్రేమపెళ్లి చేసుకున్న సినీతారలు.. మీ స్టార్లు ఉన్నారేమో చూడండి!
‘ప్రేమ..’ సినిమాకు ఇది ఎంత పెద్ద కథావస్తువు అంటే.. దాని వైశాల్యం ఎంతో ఎవ్వరూ కొలవలేరు. దాని లొంతెంతో ఎవ్వరూ కనుగొనలేరు. వందేళ్ల భారతీయ సినిమాను ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. నడిపించిన.. నడిపిస్తున్న.. నడిపించబోయే సబ్జెక్ట్ లవ్! ఆ ప్రేమ కేవలం సినిమాలకే పరిమితం కాదు.. తమ జీవితాల్లోనూ భాగమే అని చాటిచెప్పారు ఎందరో సినీతారలు.. మూవీ మేకర్స్! మనకు తెలిసిన ఈతరం తారల నుంచి.. తెలియని పాత తరం మేకర్స్ వరకూ ఎంతో మంది తమ జీవితాలను […]
‘ప్రేమ..’ సినిమాకు ఇది ఎంత పెద్ద కథావస్తువు అంటే.. దాని వైశాల్యం ఎంతో ఎవ్వరూ కొలవలేరు. దాని లొంతెంతో ఎవ్వరూ కనుగొనలేరు. వందేళ్ల భారతీయ సినిమాను ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. నడిపించిన.. నడిపిస్తున్న.. నడిపించబోయే సబ్జెక్ట్ లవ్! ఆ ప్రేమ కేవలం సినిమాలకే పరిమితం కాదు.. తమ జీవితాల్లోనూ భాగమే అని చాటిచెప్పారు ఎందరో సినీతారలు.. మూవీ మేకర్స్!
మనకు తెలిసిన ఈతరం తారల నుంచి.. తెలియని పాత తరం మేకర్స్ వరకూ ఎంతో మంది తమ జీవితాలను ప్రేమ మయం చేసుకున్నారు. మనసు కోరుకున్న వారికే తమ చేయి అందించారు. అయితే.. కొన్ని సినిమా కథల్లాగ.. కొందరి ప్రేమ మధ్యలోనే తెగిన గాలిపటం అయిపోతే.. మరికొందరి ప్రేమ నూరేళ్ల పంటగా కొనసాగుతోంది. మరి, ఆ తారలెవ్వరు..? వారి మనసును దోచుకున్న ఘటికులెవ్వరు? అన్నది చూద్దామా?
మహేష్ బాబు – నమ్రతః వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో కలిసి నటించారు. అలా తొలిచూపులోనే ప్రమలో పడిన వీరిద్దరూ పెళ్లితో తమ ప్రేమకు శుభం కార్డు వేశారు. ఇప్పటికీ వీరి దాంపత్యం ఆదర్శప్రాయంగా కొనసాగుతోంది. పవన్ – రేణుదేశాయ్ః ‘బద్రి’ సినిమాలో వీరు తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ‘జానీ’ సినిమాలో నటించారు. ఈ క్రమంలో ప్రేమలో పడిన వీరిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేసి పిల్లాడు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన పవన్.. తర్వాత అన్నా లెజ్‌నోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈమె ‘తీన్‌మార్’ సినిమాలో చిన్నపాత్రలో నటించడం విశేషం. నాగార్జున – అమలః వీరిద్దరూ శివ సినిమాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ తమ జీవితాన్ని ప్రేమమయం చేసుకున్నారు. నాగచైతన్య – సమంతః ఏమాయ చేసావే సినిమాతో చైతూను నిజంగానే మాయ చేసిన సమంత.. ఆఫ్ ది స్క్రీన్ లోనూ అతనితో ఏడడుగులు వేసింది. రాజశేఖర్ – జీవితః తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి సినిమాలతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడదీయలేనంతగా కలిసిపోయారు. ఇప్పటికే జీవితారాజశేఖర్ గా కంటిన్యూ అవుతున్నారు. శ్రీకాంత్ – ఊహః ఆమె సినిమాలో కలిసినటించారు వీరిద్దరూ. ఆ సమయంలోనే ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. సుమంత్ – కీర్తి రెడ్డిః వీళ్లిద్దరిదీ ఒక విధంగా డిఫరెంట్ లవ్ స్టోరీ. వీళ్లు ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. కానీ.. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. కృష్ణ – విజయనిర్మలః ‘సాక్షి’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన కృష్ణ, విజయ నిర్మల ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కమల్ – సారికః వీరిద్దరూ కలిసి ఎన్నో తమిళ్, హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత నిజ జీవిత భాగస్వాములయ్యారు. సూర్య – జ్యోతికః కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అజిత్ – శాలినిః తమిళ్ సూపర్ హీరో అజిత్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ షాలినీ. వీళ్లిద్దరు కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ప్రసన్న – స్నేహః తెలుగువారికి సుపరిచితురాలైన స్నేహ కూడా ప్రేమించారు. ప్రసన్నను ఆమె వివాహం చేసుకున్నారు. శరత్ కుమార్ – రాధికః తమిళ్ లో సూపర్ స్టార్లుగా వెలుగొందిన రాధిక, శరత్ కుమార్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. మొదట హీరో ప్రతాప్ పోతన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న రాధిక.. ఆ తర్వాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకుంది. ఆయనకు కూడా విడాకులు ఇచ్చి, తర్వాత శరత్ కుమార్‌ను మళ్లీ పెళ్లి చేసుకుంది. అంబరీష్ – సుమలతః వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో వీరు ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. జెమిని గణేషణ్ – సావిత్రిః వీరిది కూడా ప్రేమ వివాహమే. పెళ్లికి ముందు వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. సెల్వమణి – రోజాః తెలుగు హీరోయిన్ రోజా, దర్శకుడు సెల్వమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మణిరత్నం – సుహాసినిః దిగ్గజ దర్శకుడు, ప్రముఖ హీరోయిన్ గా పేరుగాంచిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కృష్ణవంశీ – రమ్యకృష్ణః టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ – లక్ష్మీ పార్వతిః మహానటుడు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్ – ఉపాసనః వీరిద్దరిది కూడా ప్రేమ వివాహామే. ఉపాసన అపోలో ఆసుపత్రుల యజమాని కూతురు. అల్లు అర్జున్ – స్నేహాః వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాని – అంజనాః వీరిద్దరి కూడా ప్రేమ వివాహమే. అయితే.. అంజనా కాస్ట్యూమ్ డిజైనర్. ప్రస్తుతం రాజమౌళి ఆర్కా మీడియాలో పని చేస్తోంది. భానుమతి – రామకృష్ణః సీనియర్ నటి భానుమతి కూడా ప్రేమించి వివాహాం చేసుకున్నారు. ధనుష్ – ఐశ్వర్యః సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ ప్రేమ వివాహాం చేసుకున్నారు. శరత్ బాబు – రమాప్రభః ఈ సీనియర్ నటులు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని సినిమాల్లో జంటగా నటించారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.